Astrology : సెప్టెంబర్ 13 శనివారం రోజున బుధ గ్రహం, సూర్య గ్రహం ఒకేసారి సింహ రాశిలో సంచారం చేయబోతున్నాయి. ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకే రాశిలో కలయిక చెందడంతో పన్నెండు రాశులపై ప్రభావం చూపనుండగా, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి విశేషమైన అదృష్టం కలుగుతుందని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. Astrology
తుల రాశి:
ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. తీర్థయాత్రలు చేయాలని అనుకున్నవారికి కోరిక నెరవేరుతుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
మేష రాశి:
మేషరాశి వారికి ఈ గ్రహసంయోగం ప్రత్యేకంగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు, వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి సూర్య, బుధ గ్రహాల సంచారం అద్భుత ఫలితాలు ఇస్తుంది. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లాభాలు చేకూరతాయి. అవసరమైన డబ్బులు సమయానికి అందుతాయి. ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటుంది.
సింహ రాశి:
సింహరాశి వారికి ఈ గ్రహసంయోగం ఎంతో శుభకరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంతో కలసి ఆనందకర సమయాలు గడుపుతారు.
👉 మొత్తంగా, బుధ, సూర్య గ్రహాల సంయోగం ఈ నాలుగు రాశుల వారికి అనుకూల మార్పులు తెచ్చిపెట్టనుంది.
ఇవీ చదవండి: Shadashtak Yoga 2025: శని-కుజుల కలయికతో అదృష్టం దక్కే రాశులు ఇవే!
Navaratri 2025: నవరాత్రుల్లో ఈ 2 రాశుల వారికి దుర్గామాత ఆశీస్సులు!
