HomeNationalAdiVaani: గిరిజన భాషల పరిరక్షణకు కొత్త దారి చూపుతున్న AI యాప్‌

AdiVaani: గిరిజన భాషల పరిరక్షణకు కొత్త దారి చూపుతున్న AI యాప్‌

AdiVaani: భారత ప్రభుత్వం గిరిజన భాషలను కాపాడే దిశగా ఒక వినూత్న ప్రయత్నం చేసింది. “ఆదివాణి” పేరుతో ప్రత్యేక AI ఆధారిత ట్రాన్స్‌లేటింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ గిరిజన భాషలను ఇతర ప్రధాన భాషలకు అనువదించగలదు. దీంతో గిరిజన సమాజం మరియు మిగిలిన ప్రజల మధ్య కమ్యూనికేషన్ లోపాలను తగ్గించడమే కాకుండా, గిరిజన సంస్కృతిని సంరక్షించడంలోనూ ఇది కీలక పాత్ర పోషించనుంది. AdiVaani

మన దేశం అనేక భాషలతో ప్రసిద్ధి చెందింది. అయితే అందులో చాలావరకు భాషలు ఇప్పటికీ గుర్తింపు పొందలేదు. మరికొన్నింటికి లిపి కూడా లేదు. ప్రత్యేకంగా గిరిజన సమాజం మాట్లాడే భాషలు క్రమంగా అంతరించి పోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయ వారసత్వంగా భావిస్తూ రక్షించడానికి ముందడుగు వేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కృషితో ఆదివాణి AI ట్రాన్స్‌లేటర్‌ (బీటా వెర్షన్‌) ను రూపొందించారు. ఈ యాప్‌ను విడుదల చేయడం పట్ల తాము గర్విస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కేవలం ఒక టెక్నాలజీ యాప్ మాత్రమే కాదు, భారత గిరిజన వారసత్వాన్ని కాపాడే చారిత్రాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆదివాణి యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని గిరిజన భాషల పరిరక్షణ మిషన్‌లో భాగస్వాములు కావచ్చు.

ఇవీ చదవండి: PM Modi: RSS చీఫ్ 75వ పుట్టినరోజు సందర్భంగా మోదీ ప్రత్యేక వ్యాసం
Modi Trump : మోదీ నాకు మంచి ఫ్రెండ్.. ఫోన్ చేసి సెట్ చేస్తా!
Jerusalem Attack : జెరూసలేంలో ఉగ్రదాడి: ఆరుగురు మృతి.. ఖండించిన మోదీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు