Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో హృదయ విదారకమైన హత్య జరిగింది. స్వాన్ లేక్ గేటేడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను గుర్తు తెలియని నిందితులు కాళ్లు, చేతులు కట్టి, తలపై ప్రెజర్ కుక్కర్ మూతతో బలంగా కొట్టి, కత్తితో గొంతు కోసి హత్య చేశారు. Hyderabad
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, ఈ ఘటనకు 11 రోజుల క్రితం రేణు అగర్వాల్ ఇంట్లో పనికి చేరిన ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తమైంది. హత్య అనంతరం, రక్తం మరకలు పట్టిన బట్టలను అక్కడే వదిలి, ఇంట్లో స్నానం చేసి వేరే దుస్తులు మార్చుకొని, ఇంట్లోని బంగారం, డబ్బును దోచుకొని పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అలాగే పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: Tamilnadu Crime : 15 ఏళ్లుగా సర్పంచ్.. చోరీల బ్యాగ్రౌండ్ తెలిసి షాక్!
Telangana Crime : ప్రియుడితో కలిసి నా భార్య నన్ను చంపాలని..!
