HomeTelanganaBhatti : తెలంగాణకు తక్షణ వరద సాయం కావాలి

Bhatti : తెలంగాణకు తక్షణ వరద సాయం కావాలి

Bhatti : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తులు, ప్రాణనష్టం చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్రం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. (Bhatti)

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార నేతృత్వంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేస్తూ, గత ఏడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో వరదల కారణంగా రూ.11,713 కోట్ల సాయం కోరినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని గుర్తు చేశారు. తాజాగా అంచనా వేసిన రూ.5,018 కోట్లు కలిపి మొత్తం రూ.16,732 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు.

రాష్ట్రంలో ప్రత్యేకించి కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలు వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూశాయని తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని అభ్యర్థించారు.

ప్రత్యేక ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి
తదుపరి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ సూల్స్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పెట్టుబడుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అలాగే, రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల్లో మినహాయింపు ఇవ్వాలని, గత ప్రభుత్వ కాలంలో అధిక వడ్డీతో తీసుకున్న రుణాల రీస్ట్రక్చరింగ్‌ అవసరాన్ని వివరించారు.

పామాయిల్‌ సాగు రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుందని, ప్రస్తుతానికి సుంకం తక్కువగా ఉండటం రైతులకు నష్టమవుతోందని తెలిపారు. కాబట్టి పామాయిల్‌పై సుంకం పెంచాలని కేంద్రాన్ని కోరారు.

ఇవీ చదవండి: Bhatti Vikramarka: ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని దీవించారు : భట్టి విక్రమార్క
Revanth on Kaleswaram : కాళేశ్వరంపై సీబీఐ విచారణ.. రేవంత్ సంచలన ప్రకటన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు