Rohit Sharma News: ఐపీఎల్ 2025 ముగిసిన వెంటనే అన్ని ఫ్రాంచైజీలు కొత్త సీజన్ కోసం ప్లానింగ్ మొదలు పెట్టాయి. ఈ సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఊహించని ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ప్రారంభ మ్యాచ్‌లలో పరాజయాలు ఎదురైనా, ఆ తర్వాత జట్టు బౌన్స్ బ్యాక్ అయ్యింది. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ గురించి పెద్ద వార్త బయటకు వస్తోంది. (Rohit Sharma News)
రోహిత్ శర్మ కొత్త జట్టుకు మారుతాడా?
IPL 2026 ఇంకా ప్రారంభం కాలేదు కానీ, రోహిత్ శర్మపై పెద్ద చర్చ నడుస్తోంది. 18వ సీజన్‌లో హిట్‌మ్యాన్ ముంబై ఇండియన్స్‌ను వీడవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు రోహిత్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయట. అయితే, ముంబై ఇండియన్స్ మాత్రం తన స్టార్ బ్యాట్స్‌మన్‌ను ట్రేడింగ్ చేయబోమని స్పష్టంగా తెలిపిందని సమాచారం. అంటే, వచ్చే సీజన్‌లో కూడా రోహిత్ ముంబై ఇండియన్స్‌కే ఆడే అవకాశం ఎక్కువ.
ముంబై-రోహిత్ మధ్య వివాదం నిజమేనా?
IPL 2025లో రోహిత్ శర్మ, ముంబై మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడించారని, కొన్ని మ్యాచ్‌ల్లో ప్లేయింగ్-11 నుంచి కూడా తప్పించారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అభిమానులు దీనిపై ఫ్రాంచైజీని తీవ్రంగా ట్రోల్ చేశారు. కానీ జట్టు వర్గాలు మాత్రం రోహిత్ గాయంతో ఇబ్బందులు పడ్డాడని, అందుకే అతనికి పరిమిత అవకాశాలు ఇచ్చామని చెప్పాయి.
ముంబైతో రోహిత్ విజయాలు
రోహిత్ శర్మ 2011 నుంచి ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. మొత్తం 272 మ్యాచ్‌లు ఆడి, 7046 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టెస్ట్, టీ20ల నుంచి రిటైర్ అయినా, వన్డేలో మాత్రం తన సర్వీసులు అందిస్తున్నాడు.
మొత్తానికి, IPL 2026లో రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫునే ఆడతాడా లేదా కొత్త జట్టుకు వెళ్తాడా అన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: Mumbai Indians: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్.. ఆరో కప్పు?
Rohit Sharma : టెస్టులకు రోహిత్ శర్మ వీడ్కోలు.. కెరీర్లో ఆటుపోట్లు ఇవీ!
