Kannada Actress : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కొత్త హీరోయిన్స్‌కు అవకాశాలు భారీగా వస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు రుక్మిణి వసంత్. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ అందాల తార, ఇప్పుడు దక్షిణాది సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. (Kannada Actress)
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పాపులారిటీ
కన్నడలో హీరో రక్షిత్ శెట్టి సరసన నటించిన సప్త సాగరాలు దాటి సినిమా రుక్మిణికి గట్టి గుర్తింపు తీసుకొచ్చింది. కథలోని ఆమె పాత్ర, నటనను ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఆమెకు పలు భాషల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి.
తెలుగు, తమిళ, కన్నడలో ఫుల్ బిజీ
తెలుగులో నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, కన్నడలో శ్రీమురళీతో భఘీర, అలాగే తమిళంలో విజయ్ సేతుపతితో ఏస్ చిత్రాల్లో నటించిన రుక్మిణి, ఇప్పుడు తారల సరసన వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె కెరీర్ స్పీడ్‌ను చూస్తే భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఎక్కువగానే ఉంది.
ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో అవకాశం?
ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం, రుక్మిణి వసంత్‌కు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో ఛాన్స్ దక్కినట్టు సమాచారం. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా, ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది.
విక్రమ్ 64వ సినిమాలోనూ రుక్మిణి?
ఇంకో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే, రుక్మిణి ఇప్పుడు తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన కూడా నటించనుందట. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విక్రమ్ 64వ సినిమాలో ఆమె హీరోయిన్‌గా కనిపించనుందని టాక్. ‘96’, ‘సత్యం సుందరం’ వంటి హిట్ చిత్రాలు చేసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్
రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ కలిగి ఉంది. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల మనసులు దోచుకుంటోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. క్యూట్ లుక్స్‌తో పాటు ఆమె కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండటంతో అభిమానులు ఆమెను “ఫ్యూచర్ స్టార్ హీరోయిన్”గా అభివర్ణిస్తున్నారు.
ఇవీ చదవండి: Hyper Aadi : జబర్దస్త్ మానేశానంటూ బ్యూటీ సంచలనం.. హైపర్ ఆది కారణమా?
Tollywood Beauty : నేను ప్రేమించిన వ్యక్తికి పెళ్లయిపోయింది.. బిగ్ బాస్ బ్యూటీ
