Nitish Rana: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 సీజన్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ విజేతగా నిలిచింది. ఈ విజయానికి ప్రధాన కారణం కెప్టెన్ నితీష్ రాణా. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, ఫైనల్‌లోనూ తన జట్టును గెలిపించాడు. ఆగస్టు 31న జరిగిన ఫైనల్‌లో వెస్ట్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. (Nitish Rana)
సెంట్రల్ ఢిల్లీ ఇన్నింగ్స్
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో సెంట్రల్ ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినా, యుగల్ సైనీ (65 పరుగులు, 48 బంతులు) & ప్రాంషు విజయరన్ (50 పరుగులు, 24 బంతులు) జట్టు స్కోర్‌ను గౌరవప్రద స్థాయికి చేర్చారు. చివరికి సెంట్రల్ ఢిల్లీ 173 పరుగులకే ఆగిపోయింది. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో మన్నన్, శివంక్ చెరో 2 వికెట్లు తీసుకోగా, కెప్టెన్ నితీష్ రాణా 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి కీలక వికెట్ పడగొట్టాడు.
రాణా రెచ్చిపోయిన ఫైనల్
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. కేవలం 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ, అంకిత్ కుమార్ ఔటైన తర్వాత రంగంలోకి దిగిన కెప్టెన్ నితీష్ రాణా గేమ్‌ను పూర్తిగా మార్చేశాడు.
ఫైనల్‌కు ముందు శుక్రవారం ఎలిమినేటర్‌లో 134* పరుగులు, శనివారం క్వాలిఫైయర్-2లో 45* పరుగులు చేసిన రాణా, ఫైనల్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. కేవలం 49 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79 నాటౌట్ చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. హృతిక్ షౌకీన్ (45 నాటౌట్)తో కలిసి 85 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరికి హృతిక్ సిక్స్‌తో జట్టు 18వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఒకే మాటలో చెప్పాలంటే – నితీష్ రాణా వన్ మ్యాన్ షోతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ మొదటి DPL టైటిల్‌ను గెలుచుకుంది.
ఇవీ చదవండి: Betting Apps : బెట్టింగ్ యాప్ కేసులో మిస్టర్ ఐపీఎల్ పేరు? ఈడీ సమన్లు!
Abhishek Sharma vs Digvesh Rathi : దిగ్వేష్.. నీ పిలక పట్టుకుని కొడతా..!
Shubman Gill : ఐపీఎల్ గెలవడం కంటే టెస్టు ట్రోఫీనే గొప్ప విజయం
