HomeCinemaHansika : విడాకుల రూమర్స్ మధ్య హన్సిక షాకింగ్ పోస్ట్

Hansika : విడాకుల రూమర్స్ మధ్య హన్సిక షాకింగ్ పోస్ట్

Hansika : స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆమె భర్తకు దూరంగా ఉంటోందని, త్వరలో విడాకులు తీసుకోబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చుతూ, హన్సిక ఇటీవల తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. Hansika

ఇలాంటి ఊహాగానాల నడుమ, ఆగస్టు 9న తన పుట్టిన రోజు సందర్భంగా హన్సిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఆమె,

“ఈ ఏడాది నాకు అడగకుండానే ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియని బలం ఉందని చూపించింది. మీ అందరి శుభాకాంక్షలు నా మనసు ఉప్పొంగిపోయేలా చేశాయి. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. కొన్ని చిన్న విషయాలు కూడా జీవితంలో ఎంత ఆనందాన్నిస్తాయో తెలుసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు.”
అని రాసింది.

ఈ పోస్ట్ చూసి నెటిజన్లు ఆమె విడాకుల రూమర్స్‌కు క్లారిటీ ఇస్తోందా లేదా అన్న చర్చ మళ్లీ మొదలైంది.

తెలుసుకోదగ్గ విషయం ఏమిటంటే, హన్సిక 2022 డిసెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్ సొహైల్‌ను వివాహం చేసుకుంది. ఇది సొహైల్‌కు రెండో పెళ్లి. అతను అంతకుముందు హన్సిక స్నేహితురాలిని వివాహం చేసుకుని, తర్వాత విడిపోయాడు. ఇప్పుడు హన్సిక, సొహైల్ మధ్య కూడా విభేదాలు వచ్చాయని, గత కొన్ని నెలలుగా వీరు విడిగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. సొహైల్ కుటుంబంతో హన్సిక కలవలేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని, అందుకే ప్రస్తుతం హన్సిక తల్లి దగ్గర ఉంటోందని రూమర్లు చెబుతున్నాయి.

అయితే, ఈ ప్రచారంలో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే హన్సిక లేదా సొహైల్ లేదా వారి కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. అప్పటివరకు ఈ గాసిప్స్ నెట్టింట హీట్ క్రియేట్ చేయడం ఖాయం.

ఇవీ చదవండి: Tollywood Heroine : అమ్మ మాట వినకుండా పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ ఎమోషనల్
Tollywood Buzz: మళ్లీ వైట్ కోట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. సినిమాలకు గుడ్ బై?
Kayadu Lohar : కాయడు లోహర్.. వరుస ఆఫర్లతో ముద్దుగుమ్మ బిజీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు