Oval Test Controversy: లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్ vs ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ఘనంగా ఆరంభమైంది. అయితే టాస్ ఓడిన భారత్, తొలి ఇన్నింగ్స్‌లోనే తీవ్ర ఒత్తిడికి లోనైంది. వంద పరుగులలోపు మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టు, మ్యాచ్‌ను అదుపులోకి తేయడంలో తడబడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడంతో జట్టుకు షాకిచ్చారు. అనంతరం సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. Oval Test Controversy
అయితే, తొలి సెషన్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చలకు దారితీసింది. శ్రీలంకకు చెందిన ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపింది.
వివాదాస్పద తీర్పు ఏమిటంటే?
13వ ఓవర్‌లో ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టోంగ్ వేసిన ఫుల్-టాస్ బంతి సాయిసుదర్శన్‌ను టార్గెట్ చేసింది. షాట్ ఆడే ప్రయత్నంలో సుదర్శన్ కింద పడిపోయాడు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ ఫీల్డర్లు లెగ్ బిఫోర్ వికెట్ (LBW) కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ ధర్మసేన వెంటనే తల ఊపి “నాటౌట్” అని ప్రకటించాడు. ఇక్కడివరకు సమస్య ఏమీ లేదు.
కానీ వెంటనే ధర్మసేన తన వేళ్లతో బంతి బ్యాట్‌ను తాకిందని సూచించేలా సైగ చేశాడు. ఇది చూసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బంతి బ్యాట్‌ను తాకిందని భావించి DRS తీసుకోవడాన్ని మానేశారు. నిజానికి అంపైర్ బంతి బ్యాట్‌ను తాకిందా లేదా అనే అంశంపై అభిప్రాయం ఇవ్వకూడదు. ఆటగాళ్లే తమ డిసిషన్ తీసుకోవాలి. కానీ అంపైర్ చేతి చలనంతో ఆ ప్రభావితం అయింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం అని క్రికెట్ అభిమానులు వాదిస్తున్నారు.
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత
ఈ ఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు అంపైర్ ధర్మసేనపై మండిపడుతున్నారు. “అంపైర్ తలుపు దాటి నిర్ణయాలు తీసుకుంటే ఆటలో న్యాయం ఎక్కడ ఉంటుంది?” అంటూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఐసీసీ జోక్యం తీసుకొని ధర్మసేనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: Ind vs Eng 4th Test : వీరోచిత పోరాటం.. చివర్లో వివాదం!
IND vs ENG : దశాబ్దం తర్వాత టీమిండియా పేరిట చెత్త రికార్డు
