Rishabh Pant : భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు ఊహించిందే జరిగింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మొదటి రోజే అతడు గాయపడి టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ప్రయత్నంలో పంత్ కాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానంనుంచి గోల్ఫ్ కార్ట్‌లోనే బయటకు తీసుకెళ్లారు. Rishabh Pant
తాజా మెడికల్ నివేదికల ప్రకారం, పంత్‌కు కాలులో ఫ్రాక్చర్ గుర్తించారు. ఈ గాయం కారణంగా అతడికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. దీంతో అతడు ఈ నాల్గవ టెస్ట్‌తో పాటు, జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకూ జరిగే ఐదవ టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు.
బీసీసీఐ ప్రకారం:
“పంత్‌కు ఫ్రాక్చర్ నిర్ధారణ అయింది. నొప్పి తగ్గించేందుకు ఔషధాలిచ్చాం, అతడిని మళ్లీ బ్యాటింగ్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే, అతడు నడవడానికి కూడా సహాయం అవసరం కావడం వల్ల, మిగతా మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేదు.”
ఈ పరిణామం నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌లో వికెట్ కీపింగ్ బాధ్యతలను ధ్రువ్ జురెల్ చేపట్టనున్నాడు. అయితే అతడు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేడు. దాంతో టీమిండియాకు ఒక ప్రధాన బ్యాటర్ తగ్గిపోయినట్లైంది.
ఇక ఐదవ టెస్ట్ కోసం వికెట్ కీపర్ ఎంపికపై బీసీసీఐ దృష్టి పెట్టింది. జురెల్‌కు ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిషన్ పేరును పరిగణనలోకి తీసుకుంటున్నారు. గాయాలతో ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి ఆటగాళ్లు దూరమవుతుండటంతో జట్టు సమతుల్యత ప్రభావితమవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పంత్‌తో కలిసి పనిచేసిన రికీ పాంటింగ్ కూడా అతడి గాయం చూసి ఫ్రాక్చర్ అయి ఉండవచ్చని అనుమానించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ కూడా పంత్ ఈ సిరీస్‌కు ఇక దూరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సిరీస్ వంటి కీలక సమయంలో పంత్‌ను కోల్పోవడం టీమిండియాకు చాలా పెద్ద లోటు అనే చెప్పాలి.
ఇవీ చదవండి: Pant Viral video : “టీమిండియాలో నా బావ అతడే!” – రిషబ్ పంత్ సంచలన వ్యాఖ్యలు..
Rishabh pant: ఐపీఎల్ రికార్డుడు బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. రూ.27 కోట్లు!
