Tollywood: తారలు తమ ఫిజిక్ మెయింటైన్ చేయడంలో ఎంతలా కష్టపడతారో తెలిసిందే. వర్కౌట్స్, డైట్స్.. ఇవన్నీ రోజువారీ కార్యక్రమాలే. అయితే ఓ బాలీవుడ్ బ్యూటీ మాత్రం దీనికి మించి అడుగు వేసింది. బరువు తగ్గించుకోవడం కోసం ఏకంగా 9 రోజులు ఏమీ తినకుండా కేవలం నీళ్లు తాగుతూ జీవించిందట. ఇది ఆమె మాటల్లోనే! (tollywood)
ఇక్కడ చెప్పిన నటి మరెవరో కాదు, నర్గీస్ ఫక్రి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న “హరిహర వీరమల్లు” చిత్రంలో నటించిన ఈ బ్యూటీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన డైట్ రూటీన్ గురించి వివరించింది. ఈమె చెప్పిన విషయాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.
“తొమ్మిది రోజులు కేవలం నీళ్లు మాత్రమే తాగుతాను. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. చివరి రోజులకు వచ్చేసరికి ముఖం ఆకారం మారిపోతుంది. బుగ్గలు లోపలికి పోతాయి, కళ్లు లోనపడతాయి. కానీ ఫేస్ లో మాత్రం ఓ స్పెషల్ గ్లో కనిపిస్తుంది,” అని నర్గీస్ వివరించింది. అయితే తాను పాటించే ఈ స్ట్రిక్ట్ డైట్ పద్ధతిని ఎవరికీ ఫాలో అవ్వమని ఆమె హెచ్చరించింది.
“ఇది తేలిక కాదు. అందుకే ఏ ఒక్కరికి సలహా ఇవ్వను. మంచి నిద్ర, పోషకాహారం, తరచూ నీళ్లు తాగడం ఇవే అసలైన ఆరోగ్య రహస్యాలు” అని ఆమె సూచించింది.
ఆరోగ్యంపై దృష్టి:
నర్గీస్ ఫక్రి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోతానని, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటానని చెప్పింది.
కెరీర్ విషయానికొస్తే…
2011లో “రాక్ స్టార్” మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నర్గీస్, “మే తేరిహీరో”, “హౌస్‌ఫుల్ 3”, “మద్రాస్ కేఫ్”, “అజర్”, “అమవాస్” వంటి సినిమాల్లో నటించింది. అయితే స్టార్ హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయినా, తన ఫిట్‌నెస్‌తో మాత్రం ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. తాజాగా “హౌస్‌ఫుల్ 5″లోనూ ఆమె పాత్ర కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: Priya Bhavani Shankar: తళుక్కుమనే తార.. ప్రియా భవానీ శంకర్.. ఫొటో గ్యాలరీ
