HomeAndhra PradeshChandrababu : కుప్పం మహిళను ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu : కుప్పం మహిళను ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కుప్పం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రూ.80 వేలు అప్పు తిరిగి చెల్లించని కారణంగా శిరీష అనే మహిళను టీడీపీ కార్యకర్త కుటుంబం నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు రాజకీయ ప్రముఖులు దీన్ని ఖండించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ఆ మహిళను ఫోన్లో పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.

చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు.

ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాని సూచించారు.

ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని….ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి…అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సియం అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి: YS Jagan on Kuppam crime : కుప్పం దారుణంపై వైయస్ జగన్ రియాక్షన్
Kuppam Crime : సీఎం ఇలాకాలో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి..!
MLC Varudu Kalyani : సభ్యసమాజం సిగ్గుపడేలా కుప్పంలో మహిళపై దాష్టీకం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు