HomeAstrologyMangala Sutram : మంగళసూత్రం మెడలో నుంచి తీయొచ్చా?

Mangala Sutram : మంగళసూత్రం మెడలో నుంచి తీయొచ్చా?

Mangala Sutram : హిందూ సంప్రదాయంలో మంగళసూత్రం వివాహిత మహిళకు అత్యంత ముఖ్యమైనది. పురుషుని గండాలను దాటించే మహోన్నతమైనదిగా తాళిబొట్టును పెద్దలు అభివర్ణించారు. మంగళసూత్రానికి (Mangala Sutram) ఆ శక్తి ఉంటుంది. ఎవరు అలా నమ్మి పాటిస్తారో వారి ఇంట ఉపద్రవాలకు చోటు ఉండదట. మంగళసూత్రానికి ఉన్న నియమం.. ఏ కారణం చేత అయినా కూడా మెడలో నుంచి తీయకుండా ఉండటమే. అలా నమ్మిన వారు ఆ గౌరవాన్ని పాటిస్తారని, ఇక ఏ ఆరాధనా ఉండదని పండితులు చెబుతున్నారు. యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో.. గృహస్తురాలు కూడా తాళిబొట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంతోనూ తీయరాదని పండితులు చెబుతున్నారు.

సంవత్సరంలో ఒక రోజు…
ఏడాదిలో ఒక రోజు ఒక తిథిని ప్రత్యేకంగా తాళిబొట్టు పరిశీలించుకుని ఏమైనా ఇబ్బంది ఉంటే మార్చుకోవడానికి కేటాయించారని పండితులు చెబుతున్నారు. ఆ తిథి రోజున ఎవరూ చూడకుండా మంగళ సూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు భర్తతో మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి పరిశీలించుకోవచ్చు. ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందా? అన్నది చూసుకుని ఆ తిథినాడు ఏమైనా మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటే ఇస్తారు.

నమ్మకమే భగవంతుడు
ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు. నమ్మకమే భగవంతుడు. అన్నీ మూఢ విశ్వాసాలు అనేందుకు అవకాశం ఉండదు. నమ్మకమే ఈశ్వరుడిగా కొలిచే హిందూ సంప్రదాయం మనది. కాబట్టి చెట్టుమీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ. నమ్ముకుంటే అమ్మ. ఏదైనా మీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ మంగళసూత్రం అనే దానికి అంతటి ప్రాముఖ్యత సంతరించుకుందని పెద్దలు చెబుతారు. ఇటువంటి మంగళసూత్రం.. స్త్రీ, పురుషుల ఇద్దరి ఉనికికి, అస్థిత్వానికి ప్రతీక. వాళ్లు ఉన్నారన్న దానికి కారణం.

ఇవీ చదవండి: Mattelu: కాలి మట్టెలు, తాళిబొట్టు ఎందుకు ధరిస్తారు? హిందూ ధర్మం ప్రకారం వీటి విశిష్టత ఏంటంటే..
Mangalsutra: తాళిబొట్టు ఇతరులకు కనిపించకుండా ధరించాలా? పురాణాలు ఏం చెబుతున్నాయి?
Ganga River: పూజ మధ్యలో తుమ్మితే కుడి చెవిని ఎందుకు పట్టుకుంటారు? భగీరథుడి కథ!
Parenting: తల్లిదండ్రులూ మీ పిల్లలతో జాగ్రత్త.. ప్రతి విషయాన్నీ గమనిస్తారు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు