HomeAndhra PradeshObulapuram Mining Case : ఓబుళాపురం కేసులో 14 ఏళ్ల సంచలనం.. ఆసక్తికర విశేషాలివే!

Obulapuram Mining Case : ఓబుళాపురం కేసులో 14 ఏళ్ల సంచలనం.. ఆసక్తికర విశేషాలివే!

Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎట్టకేలకు 14 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సీబీఐ కోర్టు ఎట్టకేలకు తుది తీర్పు (Obulapuram Mining Case) వెలువరించింది. ఓఎంసీ కేసులో ఐదుగురికి శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) ని నిర్దోషిగా తేల్చింది. A8 కృపానందంని నిర్దోషులుగా హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. సీబీఐ కోర్టు (CBI Court) 219 సాక్షులను విచారించి, 3,400 డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఈ తీర్పును వెలువరించింది.

నిందితులు
ఏ1 B.V. శ్రీనివాస రెడ్డి
ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy)
ఏ3 V.D. రాజగోపాల్ (గనుల శాఖ మాజీ డైరెక్టర్)
ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
A7 మెఫజ్ అలీ ఖాన్ (గాలి వ్యక్తిగత సహాయకుడు)
వీరికి సీబీఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

నిర్దోషులు
సబితా ఇంద్రారెడ్డి (2004-09 మధ్య గనులశాఖ మంత్రిగా పనిచేశారు)
కృపానందం (రిటైర్డ్ ఐఏఎస్ అధికారి)
ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి
2022లో ఏ6 శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జి చేసిన తెలంగాణ హైకోర్టు

ఈ కేసులో మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డితో సహా ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గాలి జనార్ధన్ రెడ్డి తన వయస్సు మరియు సామాజిక సేవలను పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని కోర్టును కోరగా, న్యాయమూర్తి దీనిని తిరస్కరించారు.

కేసు నేపథ్యం
అనంతపురం జిల్లా, కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం ప్రాంతంలో గాలి జనార్ధన్ రెడ్డి నేతృత్వంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ 2007లో 95 హెక్టార్లలో ఇనుప ఖనిజ గనుల లీజును పొందింది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ లీజును కేటాయించింది. అయితే, ఈ తవ్వకాల్లో అక్రమాలు, అటవీ భూముల ఆక్రమణ, ప్రభుత్వానికి తక్కువ రాయల్టీ చెల్లింపు వంటి ఆరోపణలు రావడంతో 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది.

సీబీఐ 2011లో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిలో గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన సోదరుడు బీవీ శ్రీనివాస రెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీని దోషులుగా పేర్కొంది. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఒకరైన లింగయ్య మరణించగా, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని 2022లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఆరోపణలు, దర్యాప్తు
సీబీఐ దర్యాప్తులో ఓఎంసీ కంపెనీ దాదాపు రూ.884 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఇవీ:
– ఇనుప ఖనిజ తవ్వకాల్లో అటవీ భూముల ఆక్రమణ.
– క్యాప్టివ్ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించి, ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించిన ఖనిజాన్ని బయటకు ఎగుమతి చేయడం.
– ప్రభుత్వ రాయల్టీలను తక్కువగా చెల్లించడం మరియు చట్టవిరుద్ధమైన లాభాలను ఆర్జించడం.
– సీబీఐ 2011లో గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఆయన దాదాపు 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.

రాజకీయ, న్యాయ పరిణామాలు
ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాలి జనార్ధన్ రెడ్డి, కర్ణాటకలో బీజేపీ నాయకుడిగా, గతంలో బళ్లారి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ కేసు దీర్ఘకాలంగా రాజకీయ వివాదాస్పదంగా ఉంది. దోషులుగా తేలిన వారు ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా తేలడం కూడా రాజకీయంగా ముఖ్యమైన పరిణామంగా భావించబడుతోంది. ఎందుకంటే ఆమె 2004-2009 మధ్య గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇవీ చదవండి: AP Free Sand: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ ఆదేశాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ
New Presidents to BJP: అధ్యక్షుల మార్పు.. ఎన్నికల్లో ఫలితమిస్తుందా? బీజేపీ వ్యూహాత్మక అడుగులు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు