HomeAndhra PradeshModi Amaravati : అమరావతిలో మోదీ ప్రసంగం.. వాహ్ వా.. వాహ్ వా!

Modi Amaravati : అమరావతిలో మోదీ ప్రసంగం.. వాహ్ వా.. వాహ్ వా!

Modi Amaravati : ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన (Amaravati) ముగిసింది. రాజధాని పనుల పున: ప్రారంభానికి వచ్చిన ప్రధానమంత్రి.. (PM Modi) రిమోట్ బటన్ నొక్కి పనులను, అభివృద్ధి కార్యక్రమాలను (Modi Amaravati) ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే…

మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. మిత్రులు చంద్రబాబు, శక్తివంతుడు పవన్ కల్యాణ్ నమస్కారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సోదరులారా. అమరావతి అనే పుణ్యభూమిపై ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరమే కాదు…నాకు కల నిజమవుతున్నదన్న భావన కలుగుతోంది. ఒక కొత్త అమరావతి.. కొత్త ఆంధ్రప్రదేశ్.. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది. వికసిత భారత్ ను నిర్మించుకోగలిగిన శక్తి ఉంది. ఈ రోజు రూ.60 వేల కోట్ల పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇది కేవలం కాంక్రీట్ నిర్మాణాలే కావు..ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతోంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకన్న స్వామిల పాదాలకు నమస్కరిస్తూ.. ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇంద్రుడు తాలూకా రాజధాని అమరావతి అని తెలుసు.. ఇప్పటి అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా నిలిచింది. ఇది యాదృచ్ఛికం కాదు..ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభసూచకం. స్వర్ణాంధ్ర వికసిత భారత్ సంకల్పానికి బలమిస్తుంది. అమరావతి అంటే ఒక నగరం కాదు..ఒక శక్తి.. అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి.

అమరావతి అనేది ప్రతి ఏపీ యువకుడి కల నిజమయ్యే నగరంలా తయారవుతుంది. ఐటీ, ఏఐ, క్లీన్ ఎనర్జీ, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో దేశంలోనే అమరావతి ప్రధాన నగరంగా నిలవబోతోంది. ఇందుకోసం రికార్డు సమయంలో పనులు పూర్తయ్యేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది.

టెక్నాలజీ నాతో మొదలైందని అందరూ ప్రశంసిస్తున్నారు. నేను గుజరాత్ సరికొత్తగా సీఎంగా అయిన రోజుల్లోనే చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీని ఏవిధంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా పరిశీలించాను. అప్పుడు అధికారులను పెట్టి పరిశీలింపజేసి నేను ఆ రోజు తెలుసుకున్న విషయాలను ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.

నా అనుభవంతో చెబుతున్నా.. పెద్ద స్కేల్ లో ప్రాజెక్టులు చేయాలన్నా.. తొందరగా అవి పూర్తి చేయాలన్నా…నాణ్యతతో చేయాలన్నా దేశంలో చంద్రబాబు కన్నా మిన్న ఎవరూ లేరు.

2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను.. గత పదేళ్లుగా కేంద్రం అన్ని రకాలుగా అమరావతికి మద్దతుగా నిలిచింది. మౌలిక వసతులకు అన్ని విధాలుగా సాయం చేసింది. ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంగా ముందుకు వెళుతోంది. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇది దివంగత ఎన్టీఆర్ గారు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు.. మనందరం కలసి అమరావతి, ఆంధ్రప్రదేశ్ ను వికసిత భారత్ కు గ్రోత్ ఇంజిన్ గా చేయాలి. ఎన్టీఆర్ కలలు సాకారానికి కృషి చేయాలి. మనమే చేయాలి.. నారా చంద్రబాబుగారు,, బ్రదర్ పవన్.. మనందరం కలసి చేయాలి. మనం..మనమే చేయాలి.

గత పదేళ్లలో భారత దేశం ఫిజికల్, డిజిటల్, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనంగా మారబోతోంది. రైల్, రోడ్డు ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి వేల కోట్లు కేంద్రం తరఫున అందించడం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నాం. ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు, మరో జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది. పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం మెరుగు కాబోతోంది. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటను తీసుకుని వెళ్లడానికి సులభం అవుతుంది. ఉద్యోగులు, పారిశ్రామికులకు కూడా సౌకర్యం కలుగుతుంది. పర్యాకటం, తీర్థయాత్రల రంగాలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రేణిగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ద్వారా తిరుపతి వెంకన్న స్వామి దర్శనం సులభంగా అవుతుంది.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు తాము రైల్వేపై ప్రాముఖ్యత సారించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు.

కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రైల్వే బడ్జెట్ రూ.9 వేల కోట్లు దాటి అందిస్తున్నాం. ముందుకంటే 10 రెట్లు ఎక్కువ. పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఏపీలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాం. 8 కొత్త వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. ఆధునిక వసతులతో అమృత్ భారత్ రైలు కూడా ఏపీ నుంచి వెళ్తోంది. గత పదేళ్లలో 750 కంటే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసేస్ లు రైల్వేలో నిర్మించాం.

70కి పైగా రైల్వే స్టేషన్లు ఏపీలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నాం. నేను ఎర్రకోట నుంచే స్పష్టంగా చెప్పాను. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేద వాడు, రైతు, యువకుడు, మహిళా శక్తి.. ఈ నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్డీయే ప్రభుత్వంలో ఇవి కేంద్ర బిందువుగా పెట్టుకుని పని చేస్తున్నాం.

రైతు జేబులకు భారం పడకుండా గత పదేళ్లలో ఎరువుల కోసం ఏకంగా 12 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. 1000కి పైగా సరికొత్త, ఆధునిక విత్తనాలు రైతులకు అందించాం. పీఎం పంట బీమా యోజన కింద ఏపీ రైతులకు 5,500 కోట్లు నష్టపరిహారం చెల్లించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్షలాది మంది ఏపీ రైతుల ఖాతాల్లో రూ.17,500 కోట్ల వరకు నిధులు జమ చేశాం. దేశ వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. నదుల అనుసంధానం ప్రారంభించాం.

రైతుకు నీటి సమస్య రాకూడదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడా వేగం మరింత పుంజుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది, కోట్లాది మంది ప్రజలు, రైతుల జీవితం మారబోతోంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని కేంద్రం, రాష్ట్రం కలిసి మెలిసి పని చేస్తాయి. మన ఆంధ్ర భూమి దశాబ్దాలుగా భారత దేశానికి అంతరిక్ష శక్తి అవతరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీహరి కోట నుంచి లాంచ్ అయ్యే ప్రతి రాకెట్ ప్రయోగం కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చేస్తుంది.

దేశ రక్షణను బలోపేతం చేసే కొత్త సంస్థను ప్రారంభింస్తున్నాం. డీఆర్డీఓ నవదుర్గ మిస్సైల్ లాంచింగ్ రేంజ్ కి శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం మన కనకదుర్గమ్మలా దేశ రక్షణకు శక్తిని నిరంతరం ఇస్తుంది. భారత్ శక్తి కేవలం ఆయుధాల్లోనే కాదు, మన ఐక్యతలో ఉంటుంది. ఈ ఐక్యత భావమే మన ఏక్ థా మాల్స్ కు మరింత బలోపేతం చేస్తుంది.

దేశంలో అనేక నగరాల్లో ఈ మాల్స్ ను నిర్మించబోతున్నాం. విశాఖలో నిర్మించేందుకు శంకుస్థాపన చేశాం. దేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకేచోట ఉంటాయి. భారత వైవిధ్యాన్ని అనుసంధానిస్తుంది. లోకల్ ఎకానమీకి ప్రోత్సాహం ఇచ్చేలా ఈ మాల్ నడుస్తుంది. ఇప్పుడే చంద్రబాబు చెప్పింది విన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న చేసుకోబోతున్నాం. నన్ను ఆరోజు ఇక్కడికి ఆహ్వానించారు. ప్రపంచ యోగా దినం ప్రకటించి పదేళ్లు కాబోతోంది. ఆరోజు కేవలం ఆంధ్రాలో యోగా ప్రచారం చేయడమే కాదు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలి.

ఈ 50 రోజులు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో యోగాను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తూ వరల్డ్ రికార్డు సృష్టించేలా వినియోగించుకోవాలి. నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయకత్వంలో కచ్చితంగా సాధించగలం. విశాఖలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను వస్తాను. ఆరోజు మనందరం కలిసియోగం చేద్దాం. ప్రపంచం దృష్టి యోగా వైపు, భారత్ వైపు మళ్లిద్దామని తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో కలలు కనే వారి సంఖ్య తక్కువేం కాదు. కలల్ని నిజం చేసే వారి సంఖ్య కూడా తక్కువేం కాదు.

నేను నమ్మకంతో చెబుతున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తోంది. సరైన వేగంతో ముందుకు వెళ్తోంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనమందరం కొనసాగించాలి. అలానే పెంచుతూ ఉండాలి. చంద్రబాబు మాట్లాడుతూ చెప్పారు. 3 సంవత్సరాల్లో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని. అమరావతి పూర్తయిన తర్వాత ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చబోతోందని తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పని చేస్తానని నమ్మకంతో తెలియజేస్తున్నా.

మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకీ జై… వందే మాతరం…’’ అని ప్రధాని మోదీ ప్రసంగం ముగించారు.

ఇవీ చదవండి: Amaravathi Works: ప్రధాని మోదీ అమరావతి పర్యటన.. రాజధానిలో ఆసక్తికర వాతావరణం!
Amaravathi: రాజధాని పనుల పున:ప్రారంభానికి రైతులకు ఆహ్వానం
PM Modi: ఈనెల 12న ఏపీకి ప్రధాని మోదీ రాక.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు