Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గుంటూరు కారం మూవీ అనంతరం మహేష్ బాబు (Mahesh Babu) ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తుండడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు లుక్స్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. త్రో బ్యాక్ పిక్స్ లో ఓ అమ్మాయితో ఉన్న పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. తన అందాలతో యూత్ హృదయాలను గెలుచుకుంటోంది. ఆమె మరెవరో కాదు ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీతో హిట్ అందుకున్న రమ్య పసుపులేటి (Ramyaa Pasupuleti). ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది. టిక్ టాక్ వీడియోలతో అలరించేది. అనంతరం ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను కట్టిపడేస్తోంది. హుషారు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో చిన్న పాత్రే చేసింది.
అనంతరం ఓ వెబ్ సిరీస్ లోనూ అ అమ్మడు యాక్ట్ చేసింది. ఇక రీసెంట్‌గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమాలో తన అందంతో ఔరా అనిపించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీలో చాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస మూవీ చాన్సులు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తోందట.
విశ్వంభర మూవీలో చిరంజీవి సోదరిగా రమ్య నటిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో ఈ పిక్స్, రీల్స్ వైరల్ గా మారుతున్నాయి. క్యూట్ నెస్ తో పాటు అందాలతో ఆకట్టుకుంటోంది. అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.
ఇవీ చదవండి: Vijay Rashmika: లంచ్ డేట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫొటో వైరల్
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
