HomeTelanganaCosmetic charges: తెలంగాణలో డైట్ కాస్మొటిక్ చార్జీల సవరణ

Cosmetic charges: తెలంగాణలో డైట్ కాస్మొటిక్ చార్జీల సవరణ

Cosmetic charges: వివిధ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లు, గురుకులాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్ మరియు కాస్మొటిస్ చార్జీలు (Cosmetic charges) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డైట్ చార్జీలు: (బాలురు, బాలికలు)
* 3 నుంచి 7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1330కు పెంపు
* 8 నుంచి 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540కు పెంపు
* ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 2100కు పెంపు

కాస్మొటిక్ చార్జీలు:

బాలికలకు..
* 3 నుంచి 7వ తరగతి విద్యార్థినులకు రూ.55 నుంచి రూ.175కు పెంపు.
* 8 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275కు పెంపు.

బాలురకు…
* 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి 150కు పెంపు
* 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.62 నుంచి రూ.200కు పెంపు.

థాంక్యూ సీఎం సార్..
* ప్రభుత్వ హాస్టళ్ళు, అన్ని గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలను 40% మేరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ పలుచోట్ల విద్యార్థినీ విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు.
* స్కూల్ పిల్లల్ని ఉచితంగా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన “తెలంగాణ దర్శిని” కార్యక్రమంపైనా వారు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.

బలవర్ధకమైన పౌష్టికాహారం..
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు 40 శాతం మేరకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలన్న అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి యథాతథంగా ఆమోదించారు. ఈ పెంపుదల వల్ల రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ మల్లు రవి కూడా ఉన్నారు.

దీపావళి పండుగ శుభ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.

ఇవీ చదవండి: Telangana News: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్‌ను అభినందించిన సీఎం
University: విశ్వవిద్యాలయాల ప్రక్షాళన.. తెలంగాణ సర్కార్ కీలక అడుగులు?
CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు