HomeAndhra PradeshCPI Narayana: కొల్లేరు పరిరక్షణకు నడుం బిగించండి

CPI Narayana: కొల్లేరు పరిరక్షణకు నడుం బిగించండి

CPI Narayana: కొల్లేరు సరస్సును పరిరక్షించాలని సీపీఐ జాతీయ నేత నారాయణ (CPI Narayana) అన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఈ మేరకు ఆయన లేఖలు రాశారు.

కొల్లేరు పరిరక్షణలో సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందన్నారు. కొల్లేరు తడి భూములు, పక్షుల అభయారణ్యం ఆక్రమణకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 20-25 ఎకరాల సరస్సు మాత్రమే మిగిలి ఉందని నారాయణ గుర్తు చేశారు. కొల్లేరులో చేపల చెరువులను ఆలస్యం చేయకుండా వెంటనే కూల్చివేయాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా పక్షి ప్రేమికులు కొల్లేరు పక్షి అభయారణ్యాన్ని సందర్శిస్తున్నారని నారాయణ తెలిపారు. తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు. కొల్లేరు సమీప ప్రాంతాలు పర్యావరణం కలుషితమవుతున్నాయన్నారు. కొల్లేరు జలాలను కలుషితం చేసేలా ఫ్యాక్టరీలను అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. కొల్లేరు సరస్సును అంతర్జాతీయ సందర్శన కేంద్రంగా మార్చాలని సూచనలు చేశారు.

ఇథనాల్ ఫ్యాక్టరీ మూసేయాలి
తూర్పుగోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డిలో గ్రామస్తుల ఆమరణదీక్షలు చేశారు. అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ ఆందోళనలు చేశారు. ఐదు రోజులుగా నాలుగు గ్రామాల ప్రజలు దీక్షలు చేస్తున్నారు. కంపెనీ వ్యర్ధాలు, దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నట్టు ఆవేదన చెందుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ కారణంగా 8 మంది మరణించారని గ్రామస్తులు తెలిపారు.

సమస్యలను తెలియజేస్తూ పవన్ కల్యాణ్ కు గ్రామస్తులు ఉత్తరాలు రాశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు స్కూళ్లు, షాప్ లను మూసివేస్తున్నట్టు గ్రామస్తులు ప్రకటించారు. మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి కాలుష్యం లేదని యాజమాన్యం చెబుతోంది.

ఇవీ చదవండి: Manthena Satyanarayana Raju: మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో దినచర్య ఎలా ఉంటుందంటే.. ఫీజు ఎంత?
Ganga River: భారతదేశంలో లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు?
CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
Pawan: ‘సరస్వతి పవర్’లో అటవీ భూములపై పవన్ వాకబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు