BSNL New Logo: బీఎస్ఎన్ఎల్ కొత్త లోగోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాషాయ రంగు పోలి ఉందని, అన్నింటా ఇవే రంగులా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా డ్రెస్ కూడా కాషాయం చేయాలని చూస్తున్నారని, దూరదర్శన్ కలర్ కూడా కాషాయం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇంకా పలు రకాలైన లోగోలు కాషాయమం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే బిఎస్‌ఎన్‌ఎల్ టారిఫ్‌లను పెంచే బదులు సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తామని సీఎండీ రాబర్ట్ రవి వెల్లడించారు. భారత్ సంచార్ నిగమ్ (BSNL) సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచే ఆలోచనలు లేవని ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటించారు.
తన కొత్త లోగో, ఏడు కొత్త సేవలను ప్రారంభించడంతో పాటు, భారతీ ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్లు భారతదేశంలో ధరల పెంపును ప్రారంభించిన తరువాత పొందిన కొత్త వినియోగదారులను నిలుపుకోవడం కోసం బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు లేవు
బీఎస్ఎన్ఎల్ భారతదేశంలో ప్రైవేట్ రంగ ప్రత్యర్థులు ధరలను పెంచడంతో జూలైలో భారతదేశంలో 2.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందింది. దీని మార్కెట్ వాటా ఎనిమిది శాతానికి చేరుకుంది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి టెలికాం ఆపరేటర్‌ల నుంచి ఇండియన్ కస్టమర్స్ బీఎస్ఎన్ఎల్ కు మారడానికి తక్కువ టారిఫ్ లు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్.. ఇటీవల పొందిన ఈ చందాదారులను నిలుపుకోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నాల్లో సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచే చాన్స్ లేదని సమాచారం.
కొత్త లోగోను లాంచ్ చేస్తూ, బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి మాట్లాడుతూ, “సమీప భవిష్యత్తులో మేము మా టారిఫ్‌లను పెంచబోమని స్పష్టంగా చెబుతున్నాం. నేడు,బీఎస్ఎన్ఎల్ ప్రధాన ఆసక్తి మా వినియోగదారులు సంతోషంగా ఉండేలా చూడడం, వారి విశ్వాసాన్ని పొందడం. ఇప్పుడు టారిఫ్‌ల పెంపుదల మాకు అనవసరం.’’ అని పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ ఇండియాలో తన వినియోగదారులను విస్తరించాలని చూస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం, 2025 నాటికి దేశంలో 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండాలని టార్గెట్ పెట్టుకుంది. స్పామ్ ప్రొటెక్షన్, ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) వినియోగదారుల కోసం Wi-Fi రోమింగ్ సర్వీస్, ఎనీ టైమ్ SIM (ATM) కియోస్క్‌లు, ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవ వంటి ఇటీవల ప్రారంభించిన సేవలు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.
ఇవీ చదవండి: BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!
Laptop brightness: ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత పర్సెంట్ ఉంటే మంచిది?
Logi Tech Keyboard: భారత మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన కీ బోర్డ్ చూశారా!
Stress Busters: స్ట్రెస్ బస్టర్స్.. ఇవి ప్రయత్నిస్తే ఒత్తిడి మటుమాయం!
