Sayaji Shinde: టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు షాయాజీ షిండే (Sayaji Shinde) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఆయన నిన్న చేరిపోయారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ షిండేకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. మరికొన్ని నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షిండే చేరిక ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో షిండే పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని అజిత్ పవార్ పేర్కొన్నారు. పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా షాయాజీ షిండే వ్యవహరిస్తారని వెల్లడించారు. అయితే, టికెట్ విషయంపై స్పష్టత లేదు.
ఈ నేపథ్యంలో చేరిక అనంతరం షాయాజీ షిండే మాట్లాడారు. తాను ఎన్నో మూవీస్ లో పొలిటికల్ లీడర్ గా యాక్ట్ చేశానన్నారు. కానీ నిజజీవితంలో రాజకీయాల్లో చేరడం కొత్తగా ఉందన్నారు. అజిత్ పవార్ ప్రవర్తన, నడవడిక తనకు నచ్చాయని, అందుకే పార్టీపట్ల ఆకర్షితుడై చేరినట్లు వెల్లడించారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి పవార్‌తో చర్చించిన సందర్భాన్ని షిండే గుర్తు చేసుకున్నారు. పార్టీకి మరింత సమవర్థవంతంగా పని చేస్తానని తెలిపారు.
Read also: CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!
Actor Prakash Raj: లడ్డూ ఇష్యూపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు
Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్
Pawan on YSRCP: జగన్ అమాయకుడు కాదు.. పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు
Pawan Kalyan: ఒకే రోజు 13,326 గ్రామ సభలు.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Crime News: రూ.10 వేలు ఆశ చూపించి.. రూ.2.29 కోట్లు కొల్లగొట్టేశారు!
