HomeAndhra PradeshCBN on Liquor Syndicate: లిక్కర్ సిండికేట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..

CBN on Liquor Syndicate: లిక్కర్ సిండికేట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..

CBN on Liquor Syndicate: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల్లో అధికార పార్టీకి చెందిన నేతలే సిండికేట్ అయ్యారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వేరే ఎవరినీ అప్లికేషన్లు వేయనీయకుండా కూటమి నేతలు సిండికేట్ గా మారిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించారు.

ఇవాళ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) మీడియాతో మాట్లాడుతూ.. చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారో ముఖ్యాంశాలు ఇవీ.. (CBN on Liquor Syndicate)

– మద్యం టెండర్ల పారదర్శకంగా జరగాలి
– మద్యం టెండర్లలో జోక్యం చేసుకునే నేతలను సహించను
– ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే చర్యలను ఉపేక్షించం
– పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ప్రజలకు మంచి చేయటమే పొలిటికల్ గవర్నెన్స్
– ఇసుక లభ్యత తక్కువగా ఉన్నందున కొన్ని ఇబ్బందులు

– తక్కువ ధరకే ఇసుక ఇచ్చేలా ఆలోచిస్తున్నాం
– ఇసుక సరఫరాలో ఎవరి జోక్యం లేకుండా చేస్తాం
– పొలిటికల్ గవర్నెన్స్ అంటే అన్నింట్లోనూ తలదూర్చటం కాదు
– మద్యం టెండర్లలో ఎక్కువ పోటీ ఉండాలని కోరుకుంటున్నాం
– ఆదాయం కోసం పోటీ పెంచుతారా.. అని విమర్శిస్తున్నారు
– అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాలి

– ఇసుక సరఫరాపై మేం కూడా ఆందోళన చెందుతున్నాం
– వర్షాలు, వరదల వల్ల డిమాండ్ కు తగినట్లు ఇసుక లభ్యత లేదు
– ఎన్జీటీ నిబంధన వల్ల రాత్రిపూట ఇసుక తవ్వలేం
– రాష్ట్రంలో అధికారుల సంఖ్య తక్కువగా ఉంది
– గత ప్రభుత్వం అధికారులతో అనేక తప్పులు చేయించింది
– అందరినీ పక్కనపెడితే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు

– రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా తక్కువే ఉన్నారు
– వాణిజ్య పన్నులశాఖకు ఇంతవరకు కమిషనర్ ను ఇవ్వలేకపోయా
– 30 జిల్లాల ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదు
– మార్కాపురం, మదనపల్లె, ఇతర హామీలున్నాయి. అవి ఇప్పుడే కాదు
– తప్పుడు పోస్టులు, నకిలీ ప్రచారంపై ఓపిక పడుతున్నా
– మితిమీరి ప్రవర్తిస్తే ఏం చేయాలో నాకు తెలుసు

– హైదరాబాద్ – విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే అవసరం
– గ్రీన్ ఫీల్డ్ హైవేను బందరు పోర్టుకు అనుసంధానిస్తాం
– దీనివల్ల హైదరాబాద్ లోనూ డ్రై పోర్టు వస్తుంది
– పెరుగుతున్న నిత్యావసరాల ధరలను సమీక్షిస్తున్నాం
– పలుసార్లు ఢిల్లీ వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయి

– త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో విడత భర్తీ
– గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది నేనే
– నన్ను ఉంచిన జైలు మీద డ్రోన్లు కూడా ఎగురవేశారు
– నా ప్రతి కదలిక గమనించేందుకు జైలు గదిలో సీసీ కెమెరా పెట్టారు

– జైలులో వేడి నీరు ఇవ్వలేదు, దోమలు కుడుతున్నా పట్టించుకోలేదు
– నన్ను చంపాలని చూశారనే ప్రచారం కూడా జరిగింది
– కక్షలు తీర్చుకునే స్వభావం నాది కాదు
– తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. చర్యలు ఉంటాయి.

ఇవీ చదవండి: CBN on Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Botcha Satyanarayana: ఆ 25 వర్గాలకు చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారా?
Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు