Bigg Boss 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 అట్టహాసంగా ప్రారంభమైంది. కంటెస్టెంట్లు అందరూ వరుసగా ఏవీలతో ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరినీ హోస్ట్ నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తూ షో సందడిగా మొదలైంది. ఇంతవరకు మీరు చూసిన ఆట వేరు.. ఈ సీజన్ లో మీరు చూడబోయే ఆట వేరు అంటూ నాగార్జున, బిగ్ బాస్ రంగంలోకి దిగారు. (Bigg Boss 7)
కాసేపటి క్రితం ఈ సీజన్ తొలి ఎపిసోడ్ మొదలైపోయింది. అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ లో పాల్గొంటున్న కంటిస్టెంట్స్ వివరాలు నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. గతంతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ షో మరింత ప్రత్యేకంగా నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఉల్టా పుల్టా.. ఈ సీజన్ మామూలుగా ఉండదు.. మీ అంచనాలకు అందనట్టుగా ఉంటుందంటూ నాగార్జు, అటు బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ప్రకటనలు, ప్రోమోలతో దంచి కొడుతున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేసి మొత్తానికి రంగంలోకి దిగారు.
ఈ సారి బిగ్ బాస్ హౌస్, హోస్ట్ నాగార్జున లుక్ కాస్త కొత్తగా, డిఫరెంట్ గా కనిపిస్తోంది. నేడు (ఆదివారం) సెప్టెంబర్ 03 రాత్రి 7 గంటలకు ఈ షో ప్రారంభం అయ్యింది. అయితే ఈ సీజన్ లో తొలి కంటిస్టెంట్ గా టీవీ సీరియల్ (జానకి కలగనలేదు) నటి ప్రియాంక జైన్ మొదటి కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని కాస్త హాట్‌గా కనిపిస్తూ ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే గేమ్ గెలిచేస్తానంటూ నాగ్‌తో చెప్పింది ప్రియాంక జైన్.
కాగా ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. హౌస్‌లోకి పంపిన తొలి రోజే తొలి కంటిస్టెంట్ చేతిలో సూట్ కేస్ పెట్టేసి కొత్త పంచాయితీ పెట్టారు. ఈ సూట్ కేస్ చూసి మొదటి కంటెస్టెంట్ ప్రియాంక షాక్ తినింది.
ఇక రెండో కంటిస్టెంట్ గా నటుడు శివాజీని ఆహ్వానించారు నాగార్జున. వచ్చీ రావడంతోనే శివాజీ తన కెరీర్ బిగినింగ్ డేస్ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బిగ్ బాస్‌కు వచ్చి ఇక్కడ తన మార్క్ ప్రదర్శించుకోవాలని శివాజీ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.
మూడో కంటిస్టెంట్ గా సింగర్ దామిని ఎంటర్ అయింది. తన గురించి కొన్ని విషయాలు చెప్పి ఆసక్తి రేకెత్తించింది. అయితే ఆమె కంటిస్టెంట్ గా ఫైనల్ కాలేదని చెప్పి బిగ్ షాకిచ్చారు నాగ్. పవర్ అస్త్రాని సొంతం చేసుకుంటేనే కంటిస్టెంట్ గా ఫైనల్ అవుతారని చెప్పారు. నాలుగో కంటిస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇతను హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే తన ప్రత్యేకత చూపించాడు. షర్ట్ లేకుండా హౌస్ లోకి వచ్చాడు.
ఐదో కంటిస్టెంట్ గా శుభ శ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఐదుగురు కంటిస్టెంట్లకు సూట్ కేస్ టాస్క్ ఇచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా 35 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఐదుగురిలో ఈ సీజన్ నుంచి తప్పుకుంటే ఈ 35 లక్షలు మీవే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇలా కంటెస్టెంట్లు అందరూ ఎంట్రీ ఇస్తున్నారు. పోను పోనూ ఈ షో మరింత ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి: Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్ తివారి ఫొటో గ్యాలరీ..