October 1st: ఈ ఏడాది సెప్టెంబర్ మాసం ఈ రోజుతో (30) ముగుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభం కానుంది. అయితే రేపటి నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన పలు నిబంధనల్లో మార్పులు రానున్నాయి.
సరిగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల రెగ్యులరైజ్ కోసం కొత్త నియమాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఆధార్ నంబర్ కు బదులుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని తెలపడానికి నిబంధనను ఆపేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈ నియమం అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానుంది. ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేస్తున్న సమయంలో పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని వెల్లడించాల్సిన పని లేదు.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) రేపటి నుంచి పెరుగుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు చార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి.
కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నుకు సంబంధించిన పలు మార్పులను నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. ఇవన్నీ రేపటి నుంచి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి. జీవిత బీమా పాలసీ, లాటరీ టిక్కెట్ల అమ్మకంపై కమీషన్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లించడం, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు లాంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు రేపటి నుంచి తగ్గుతాయి.
SBI Good News: డిపాజిటర్ల కోసం శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ..
Amazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ
Budget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!
BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!
