YS Jagan: పార్టీ నుంచి సీనియర్ లీడర్లు వెళ్లిపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. ఎవరు పోతున్నారు, ఏ సీనియర్ లీడర్ పోతున్నాడని ప్రశ్నించారు. పోతే పోనీ, కొత్త వారు వస్తారంటూ కామెంట్ చేశారు. ప్రజల నుంచి నాయకుడు వస్తాడన్న జగన్.. తన పార్టీ నుంచి పోయే వారిది గ్రహపాటేనని తేల్చి చెప్పారు. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో జగన్ మాట్లాడారు.
ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, ఆ తర్వాత చేసిన మోసం.. తన 100 రోజుల పరిపాలన మీద తనది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని జగన్ కామెంట్ చేశారు. ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది వెళ్లి ఆ స్టిక్కర్లు అతికించాని ప్రభుత్వం చెబుతోందన్నారు.
’’నిజానికి ఈ 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాల మూటలు. దీంతో ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎలా ప్రచారం చేశారు? ఇంటింటికి వెళ్లి పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, మహిళలు కనిపిస్తే నీకు ఏటా రూ.18 వేలు అని, రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అంటూ.. ప్రతి ఇంటికి వెళ్లి, దుర్మార్గంగా ప్రచారం చేసి నమ్మించారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసింది ఏమిటంటే.. మోసం మోసం.’’ అని జగన్ దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక
Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైయస్సార్ సీపీ
