HomeNationalPaper Leak: మీకు తెలుసా? భారత్‌లో 2019 నుంచి 65 పేపర్ లీకేజీలు.. పూర్తి వివరాలు...

Paper Leak: మీకు తెలుసా? భారత్‌లో 2019 నుంచి 65 పేపర్ లీకేజీలు.. పూర్తి వివరాలు ఇవీ

Paper Leak: ఇటీవల ఎక్కడ చూసినా పేపర్ లీకేజీల గురించే చర్చ జరుగుతోంది. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యార్థులు, అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. 2019 నుంచి భారత్ లో ఏకంగా 65 పేపర్ లీకేజీలు జరిగాయంటే మీరు నమ్ముతారా? ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతూ పోతే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారదా? పేపర్ లీకేజీలపై ఓ విశ్లేషణ ఈ కథనంలో మీకోసం..

నీట్ వివాదం దేశవ్యాప్తంగా తాజాగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, పేపర్ లీక్ కావడం ఇదేమీ మొదటిసారి కాదు. పబ్లిక్ రికార్డులు, మీడియా నివేదికలు, పరీక్ష పేపర్ లీకులపై నమోదైన FIRలు, అరెస్టులు, పరీక్షాపత్రం లీకై పరీక్షల రద్దుకు దారితీసిన ఎన్నో అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి.

ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి ఇప్పటివరకు ఎన్నో పేపర్ లీక్స్ జరిగాయి. వాటిలో 2021లో సైనికులను నియమించుకునేందుకు ఇండియన్ ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యింది. ఇదే ఏడాది NEET-UG ప్రశ్నపత్రం లీక్ అయ్యింది. ఇంకా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ పేపర్ కూడా లీక్ అయ్యింది. ఇక 2023లో సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్ష పత్రం కూడా బయటకు పొక్కింది.

ఇండియాలోని 19 రాష్ట్రాల్లో 65 ప్రధాన పరీక్షల ప్రశ్న పత్రాలు లీకైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నీట్ పరీక్ష కూడా అదే దారిన లీకులపర్వం నడుస్తోంది. పరీక్షల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 64 మంది అభ్యర్థులు పర్ఫెక్ట్ స్కోర్లు సాధించడంతో అనుమానం వచ్చింది. దాంతో ఆ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలిందన్న చందంగా రాష్ట్రాల వారీగా అత్యధిక పేపర్ లీక్స్ జరిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ (UP) మొదటి స్థానంలో నిలిచింది.

ఇక్కడ 8 పరీక్షలకు సంబంధించిన పేపర్స్ లీక్ అయ్యాయి. తర్వాతి స్థానంలో రాజస్థాన్, మహారాష్ట్ర నిలిచాయి. ఇక్కడ 7 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. మూడో స్థానంలో బిహార్ రాష్ట్రంలో 6 పేపర్లు లీకయ్యాయి. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక్కడ 4 ప్రధాన పరీక్షల పత్రాలు లీకయ్యాయి. ఈ రాష్ట్రాలు కాకుండా, హర్యానా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో 2019 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఎన్నో పేపర్లు లీకులు చేశారు. 2019 లో 9 , 2020 లో 12 , 2021 లో 17 , 2022 లో 11 , 2023 12 , 2024 లో ఇప్పటి వరకు 5 ప్రశ్న పత్రాలు లీకైయ్యాయి.

ఇలా యువత భవిష్యత్తును పణంగా పెడుతూ పేపర్ లీకేజీ వీరులు చెలరేగుతున్నా ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ పేరుతో ఆ ప్రక్రియ అలా ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంది. చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ పేపర్ లీక్స్ అనేవి కొత్త రూపం దాల్చుకుని వస్తున్నాయే తప్ప శాశ్వతంగా రూపుమాపే చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నది వాస్తవం.

Read also: Education: పిల్లలకు బడిపై ఆసక్తి పెంచేవి వృత్తి విద్యా కోర్సులు
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్‌!
Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్‌ రూపొందించిన ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం
YS Jagan at INDIA Today Education Summit: కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైయస్‌ జగన్‌.. ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో కీలక అంశాల ప్రస్తావన
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు