Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి సత్తా చాటారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కూటమి ఏకంగా 164 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. జనసేన పార్టీ 21 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి జనసేన సరికొత్త రికార్డు సృష్టించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది. ఫలితంగా ప్రతిపక్ష నేత హోదా సైతం జగన్‌కు దక్కకుండా పోయింది.
ఎన్డీయే కూటమి ఏకంగా 8 ఉమ్మడి జిల్లాలను క్లీన్ స్వీప్ చేసేసింది. లోక్ సభ ఫలితాల్లోనూ ఏకంగా 21 సీట్లతో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీ కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన రెండు ఎంపీ స్థానాలనూ కైవసం చేసుకోవడం విశేషం. మొత్తంగా ఈ ఎన్నికల్లో 81 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా అందరూ ఓటమి పాలయ్యారు.
మాజీ ముఖ్యమంత్రుల తనయులు 8 మంది ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. వారిలో వైఎస్ జగన్, నారా లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, వైఎస్ షర్మిల, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరిలో షర్మిల, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రమే ఓటమిపాలయ్యారు.
గాజువాకలో పల్లా శ్రీనివాస్‌కు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ దక్కింది. ఆయన 95,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత భీమిలిలో గంటా శ్రీనివాస్ 92,401 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడో రికార్డు మెజార్టీ మంగళగిరిలో నారా లోకేష్ 91,413 ఓట్లతో ఘన విజయం సాధించారు. 39 ఏళ్లుగా మంగళగిరిలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు లోకేష్ అక్కడ గెలిచి రికార్డు సృష్టించారు.
ఇవీ చదవండి: PM Modi in Vemagiri: చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నంబర్ వన్: ప్రధాని మోదీ
PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని కామెంట్స్
CM Jagan with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులపై చర్చ
