HomeAndhra PradeshCS Jawahar Reddy: దుష్ప్రచారంపై లీగల్‌ నోటీసులు.. న్యాయ నిపుణులతో జవహర్‌రెడ్డి సంప్రదింపులు

CS Jawahar Reddy: దుష్ప్రచారంపై లీగల్‌ నోటీసులు.. న్యాయ నిపుణులతో జవహర్‌రెడ్డి సంప్రదింపులు

CS Jawahar Reddy: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిపై ఓ రాజకీయ పార్టీ నేత చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సీఎస్‌ డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అవన్నీ నిరాధార ఆరోపణలని ఇప్పటికే సీఎస్‌ జవహర్‌రెడ్డి తోసిపుచ్చారు. అయినప్పటికీ మూర్తి యాదవ్ దుష్ప్రచారం ఆపకపోవడంతో జవహర్‌రెడ్డి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి మూర్తి యాదవ్‌కు లీగల్‌ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి బుధవారం న్యాయ నిపుణులతో సంప్రదించారు.

గతంలో జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులపై కూడా వివిధ సందర్భాల్లో ఈ విధమైన ఆరోపణలు చేశారని, ఆయా ఆరోపణలపై న్యాయపరంగా అప్పుడు ఆ ప్రముఖుల తరపున న్యాయ పరంగా ఏవిధమైన చర్యలు తీసుకున్నారో అదే రీతిలో ప్రస్తుతం సీఎస్ పై చేస్తున్న ఆరోపణలపై కూడా న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుందామని న్యాయ నిపుణులు జవహర్‌రెడ్డికి వివరించారు. ఈ నిరాధార,అవాస్తవ ఆరోపణలపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: Jawahar Reddy: నెలలో రిటైర్‌మెంట్..! సీఎస్ జవహర్ రెడ్డిపై వీరికెందుకంత కసి?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం-ఓడరేవులపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష
Elections in AP: సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలి.. పటిష్ట నిర్వహణపై సీఎస్‌ జవహర్‌రెడ్డి సమీక్ష
CS on CM Promises: హామీల అమలుపై సత్వరం చర్యలు తీసుకోవాలి: సీఎస్‌ జవహర్‌రెడ్డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు