Haj Yatra: పవిత్ర హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండో బృందం బయల్దేరి వెళ్లింది. 2024 హజ్ యాత్రను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హాజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఈద్గా జామా మసీద్ హాజ్ క్యాంప్ వద్ద పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 322 మందితో రెండో బృందం ఇవాళ సాయంత్రం 4:55 గంటలకు విమానంలో జెడ్డా బయలుదేరి వెళ్లింది.
వక్ఫ్ బోర్డ్ సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హాజ్ కమిటీ సభ్యులు సిఆర్డిఏ అదనపు కమిషనర్ అలీం భాష , దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ హాజ్ యాత్ర శుభప్రదం కావాలని, యాత్రికులకు అభినందనలు తెలిపారు.
అదేవిధంగా 48 మందితో మూడో బృందం 29వ తేదీ బుధవారం ఉదయం 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి విమానంలో బయలుదేరి హజ్ యాత్రకు వెళ్తారని కమిటీ తెలిపింది.
ఇవీ చదవండి: Haj Yatra: విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు 728 మంది
Haj Yatra: హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. నేరుగా ఏపీ నుంచే యాత్ర..!
Rahul Gandhi: మా మేనిఫెస్టో ప్రజల హృదయాల నుంచి పుట్టింది: తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ
JEE NEET: ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. విశాఖలో నీట్ జేఈఈ శిక్షణ కేంద్రం
