HomeAndhra PradeshChevireddy: చంద్రగిరిలో పోలింగ్ అనంతర అల్లర్లపై చెవిరెడ్డి రియాక్షన్ ఇదీ

Chevireddy: చంద్రగిరిలో పోలింగ్ అనంతర అల్లర్లపై చెవిరెడ్డి రియాక్షన్ ఇదీ

Chevireddy: ఏపీలోని చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తొలిసారి స్పందించారు. కూచివారిపల్లిలో చిన్న గొడవను పట్టుకుని విపక్షాలు రాద్దాంతం చేశాయని చెవిరెడ్డి మండిపడ్డారు. ఇల్లు కాల్చారు…రెండు కార్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. మూత్రం పోసి ఒక అబ్బాయిని దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుమారుడు మోహిత్ పీఆర్‌వో ఈశ్వరరెడ్డిని 15 నిమిషాల పాటు చెప్పులతో కొట్టారని చెవిరెడ్డి వాపోయారు. ఇన్ని జరిగినా నేను కేసులు పెట్టలేదు, అవమానం భరించామన్నారు. నామినేషన్ రోజు తన కొడుకుపై దాడి చేసినా తాము తిరిగి దాడి చేయలేదు…అవమానాన్ని భరించామే తప్ప ప్రతీకారానికి పోలేదన్నారు.

అసత్య ఆరోపణలు, వ్యక్తత్వ హననం చేసినా తాను కామెంట్ కూడా చేయలేదని చెవిరెడ్డి తెలిపారు. పులివర్తి డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని విమర్శించారు. దాడులు, కొట్లాటలకు దిగాలనే ఆలోచన కూడా తమకు లేదని చెవిరెడ్డి స్పష్టం చేశారు. తమకు ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఇన్ని జరిగినా తాను కేసులు పెట్టలేదు, అవమానం భరించానని స్పష్టం చేశారు. యూనివర్శిటీ దగ్గర నాని కారుపై మాత్రమే దాడి చేశారని, అది కూడా తప్పేనన్నారు. అక్కడి నుంచి యాక్టివ్ గా నడుచుకుంటూ నాని వెళ్లిపోయారని చెవిరెడ్డి తెలిపారు.

Read Also: YSRCP: చంద్రబాబుకు ఓటు వేయడం అంటే చీకటి రోజులను మళ్లీ తెచ్చుకోవడమే: సజ్జల
EC Alert: ఏపీలో పోలింగ్ తర్వాత హింసతో ఎన్నికల సంఘం అప్రమత్తం
BJP – AAP: బీజేపీ కార్యాలయం వద్ద ఆప్ నిరసన.. ఢిల్లీలో ఉద్రిక్తత
Double ISMART: డబుల్‌ ఇస్మార్ట్ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి డబుల్‌ మాస్ గ్యారెంటీ!
Strong Rooms: స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద పటిష్ట భ‌ద్ర‌త

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు