HomeAndhra PradeshYS Jagan with YSRCP Social Media: వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా సైనికులతో సీఎం...

YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్‌ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నేడు విశాఖపట్నంలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా సమావేశం నిర్వహించారు. పలువురితో మాట్లాడారు. విశాఖలోని చెన్నాస్‌ కన్వెన్షన్‌ హాలులో ఈ మీటింగ్‌ పెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో జగన్‌ మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

“ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్‌కు, పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు, ఇండిపెండెంట్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడ నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్లందరికీ కూడా.. మనం అధికారంలోకి రాకమునుపటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తున్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంత మంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.

మరో 18 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెబుతున్నా. మనకు ఒకవైపున చూస్తే, అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంటుంది వాళ్ల వాళ్ల కూటమిలో వాళ్లను చూస్తున్నప్పుడు. ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.

ఈ మధ్య కాలంలో అయితే వాళ్ల ఉక్రోశం ఏ స్థాయిలోకి వెళ్లిపోయింది అంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్ కు అంటే వాళ్ల అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, తన సంతోషాన్ని తన సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్లి ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూశాం. ఎంతటి దారుణంగా హెరాస్ చేశారో అందరం కూడా చూశాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్ కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్ కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడి దయ మీద జగన్ కు నమ్మకం ఉంది. జగన్ ను ప్రేమించే గుండెల మీద జగన్ కు నమ్మకం ఉంది. మీ అందరూ చేసిన, చేస్తున్న, చూపిస్తున్న అభిమానానికి, ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుందని మాత్రం చెప్పగలుగుతాడు.

అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. ఆర్గనైజేషన్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్ గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తున్నాడు. అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం.

మీ వెనకాల ఉండేది ఒక్క జగనే కాదు. మీ వెనకాల ఉన్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని చెబుతున్నాను.ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూమీకు అండగా ఉంటుందని చెబుతున్నాను.

ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నా. ఈ రోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంత మంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్లు. ఈరోజు ఈ సిటీని చూస్తున్నారు కదా.. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేప్పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందన్నది మాత్రం ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నా.

ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్ తో పోటీ పడే పడే పరిస్థితి, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు తీసుకుని పోయే పరిస్థితి కూడా ఉంటుంది.

మీ అందరితో ఒకటే చెబుతున్నా. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం చెబుతున్నా. ఈ దెబ్బ కనుబొమ్మ పైన తగిలింది అంటే.. అది కంటికి తగల్లేదు, కణతకు తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు.

గెలిచేది 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నా. అటు వైపున 100 మంది ఈనాడులు వచ్చినా, 100 మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 మంది టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నా భయం లేదు మీ జగన్ కు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా ఉన్నారు మీ అన్నకు అండగా.” అని సీఎం జగన్‌ అన్నారు.

ఇవీ చదవండి: Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్‌ రాజకీయాలను మార్చేశారు: కంచ ఐలయ్య
YS Jagan Assets: ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్‌ ఆస్తుల వివరాలు
Memantha Siddham: మూడు వారాలుగా జనం మధ్యలోనే జగన్‌.. పండుగలు కూడా బస్సు యాత్రలోనే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు