HomeTech NewsGoogle Pixel 8a: గూగుల్​ పిక్సెల్​ 8ఏ.. లాంచింగ్‌ ఎప్పుడు? ఫీచర్స్‌ ఎలా ఉంటాయి?

Google Pixel 8a: గూగుల్​ పిక్సెల్​ 8ఏ.. లాంచింగ్‌ ఎప్పుడు? ఫీచర్స్‌ ఎలా ఉంటాయి?

Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఈ స్మార్ట్ ​ఫోన్లో ఫీచర్ల గురించి నెట్‌లో ఆసక్తికరంగా వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్పెసిఫికేషన్లు, రిలీజ్‌ డీటెయిల్స్‌ కోసం ఆన్‌లైన్‌లో తాజాగా కొన్ని లీక్స్‌ వెలుగు చూశాయి. ఈ గ్యాడ్జెట్​ డిస్​ప్లే, కెమెరా సముదాయం, బ్యాటరీ సామర్థ్యం, రిలీజ్‌ సమయం గురించి లీక్స్‌ కొన్ని వచ్చాయి.

ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..
గూగుల్ పిక్సెల్ 8ఏలో 6.1 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుందని తెలుస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా అందుబాటులోకి తెస్తున్నారట. ఈ స్మార్ట్​ఫోన్​.. పిక్సెల్ 8 సిరీస్​లో కనిపించే టెన్సార్ జీ3 చిప్​సెట్​ మాదిరిగా ఉంటాయని ప్రచారంలో ఉంది. ఇక 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌లలో రెండు వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్‌ ఫోన్‌ పని చేస్తుందట.

కెమెరాల పనితనం వరకు చూస్తే.. ఇందులో ఓఐఎస్​తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీ- వీడియో కాల్స్​ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​లో 27వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోందని ప్రచారం ఉంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల తేదీపై (Google Pixel 8a launch date in India) అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​.. మే 14న గూగుల్ ఐ/ఓ 2024 ఈవెంట్​లో రిలీజ్‌ అవుతుందని బాగా ప్రచారంలో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ కాస్ట్‌ విషయానికి వస్తే.. ఇది ఇండియాలో సుమారు రూ .41,635 వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

మునుపటి వర్షెన్​ పిక్సెల్ 7ఏ కంటే గూగుల్ పిక్సెల్ 8ఏలో అప్​గ్రేడ్​లను బాగా చేశారని ప్రచారం జరుగుతోంది. డిస్​ప్లే పీక్ బ్రైట్​నెస్​ 1400 నిట్స్, హెచ్​డీఆర్ సపోర్ట్- టెన్సర్ జీ3 చిప్​సెట్​తో కనెక్ట్​ చేసి ఉంటారని ప్రచారంలో ఉంది. మాలీ-జీ 715 జీపీయూ గణనీయమైన మెరుగుదలను చూపిస్తోందని టెక్‌ దిగ్గజాలు చెబుతున్నారు. డిజైన్ పరంగా చూసినా వైజర్ లాంటి కెమెరా స్ట్రిప్, కర్వ్డ్ అంచులు ఉంటాయట. స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో గూగుల్ తదుపరి ఆఫర్ ఏమిటనే దానిపై వస్తున్న లీకులు, ప్రచారం.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇవీ చదవండి: Mobile Phone: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్‌ చేస్తున్నారట!!
5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..
Google Pay: మీ ఫోన్‌ పోయిందా? పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే ఎలా వాడాలంటే..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు