Miss World: మహిళలు ఎక్కువగా అందానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రాంతాలను బట్టి ఎవరి అందం వారికి సొంతం. మనదేశంలో అందమైన మహిళలకు కొదవ లేదు. అందాన్ని అంచనా వేసే పద్ధతి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు ముఖ సౌందర్యాన్ని, మరికొందరు మనసును, మరికొందరు తెలివిని అందంగా చెబుతుంటారు.
వరల్డ్ వైడ్‌గా మిస్ స్టేట్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి అనేక అందాల పోటీలు నిర్వహిస్తారు. ప్రతి అందాల పోటీలో పాల్గొనేందుకు వేర్వేరు నిబంధనలు ఉంటాయి. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలను భారత్‌లో నిర్వహించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి అందగత్తెలు పాల్గొని ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు.
మిస్ వరల్డ్ టైటిల్ సాధించడం అంత సులువేం కాదండోయ్. ఇందులో వివిధ దేశాలకు చెందిన బ్యూటీలు అనేక పారామీటర్లపై తమలో తాము పోటీ పడతారు. మిస్ వరల్డ్ 2023 పోటీలో కన్నడ బ్యూటీ సినీ శెట్టి మనదేశం తరపున పాల్గొంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే వారందరూ ఈ టైటిల్ గెలవడానికి బాగా కష్టపడాలి. ఇంతకీ ప్రపంచ సుందరి కావడానికి ఏ లక్షణాలు ఉండాలన్నది ఆసక్తికరం. ఎన్ని రౌండ్లు దాటడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా మారవచ్చన్నది చాలా మందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది.
అర్హతలు ఇవీ..
* మిస్ వరల్డ్ పోటీలో అభ్యర్థులు వారి అందం, విశ్వాసం, తెలివితేటలు వంటి అనేక స్థాయిలలో పరీక్షిస్తారు.
* దరఖాస్తుదారుల వయస్సు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
* పోటీలో పాల్గొనడానికి మరో పెద్ద నియమం ఏమిటంటే.. దరఖాస్తుదారు వివాహం, నిశ్చితార్థం, వితంతువు లేదా విడాకులు తీసుకొని ఉండరాదు.
* ఈ అందాల పోటీలో పాల్గొనడానికి, అభ్యర్థి ఎత్తు 5.3 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.
నమోదు ఎలా?
* అభ్యర్థి ఇంతకు ముందు జాతీయ స్థాయి పోటీలో పాల్గొని విజయం సాధించి ఉండాలి.
* మిస్ ఇండియా కావాలంటే https://www.femina.in/లో అప్లికేషన్ చేసుకోవాలి.
* ప్రపంచ స్థాయి అందాల పోటీలో భాగం కావడానికి ముందు, ఎవరైనా తమ దేశంలోని నేషనల్ డైరెక్టర్ ద్వారా దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయి పోటీలో గెలవాలి.
* పోటీలో పాల్గొనేవారికి ర్యాంప్ వాక్, ఇంటర్వ్యూ లాంటి అనేక దశల్లో పరీక్షలు ఉంటాయి.
పోటీ విధానం ఎలా ఉంటుందంటే..
మిస్ వరల్డ్ పోటీలో గెలవడానికి పాల్గొనేవారు అనేక దశల్లో క్లిష్టతరమైన పోటీ ఉత్తీర్ణత సాధించాలి. ప్రపంచ సుందరి కావాలనుకుంటే, దీని కోసం ఎన్ని, ఏ రౌండ్లు ఉత్తీర్ణత సాధించాలో అందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది.
* ప్రపంచ సుందరి కావడానికి మొదటి రౌండ్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంది. ఇందులో, అభ్యర్థులు పగటిపూట స్విమ్ సూట్‌లు లేదా అథ్లెటిక్ సూట్‌లను వేసుకుంటారు. సాయంత్రం గౌన్లు ధరిస్తారు. పోటీదారు లక్షణాలు, శారీరక రూపం ఈ వేషధారణ ద్వారా నిర్ణయిస్తారు.
* సాయంత్రం గౌనులో ఎంపికైన టాప్-6 పోటీదారులను ఇంటర్వ్యూ దశకు చేరుకుంటారు. ఈ రౌండ్‌లో పోటీదారుల సమాధానాల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఇందులో అభ్యర్థి లాజికల్ ఎబిలిటీ తదితరాలను టెస్ట్ చేస్తారు.
ఇవీ చదవండి: తరగని అందం.. దక్ష నాగర్కర్
బెస్ట్ డిజైనర్ డ్రస్ సినిశెట్టి అందం
Nikki Tamboli: శిల్పం లాంటి అందం.. నిక్కీ తంబోలి ఫొటో గ్యాలరీ
Actress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..
