HomeAndhra PradeshAP Industrial growth: ఏపీలో పరిశ్రమలు పారిపోతున్నాయా? ఒక్కసారి ఇటు చూసి నిజాలు తెలుసుకోండి..

AP Industrial growth: ఏపీలో పరిశ్రమలు పారిపోతున్నాయా? ఒక్కసారి ఇటు చూసి నిజాలు తెలుసుకోండి..

AP Industrial growth: ప్రతిపక్షం, వారికి మద్దతుగా నిలుస్తున్న కొన్ని మీడియా సంస్థలు నిత్యం జగన్‌ సర్కార్‌పై బురదజల్లే పనిలోనే నిమగ్నమయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింత పేట్రేగిపోయే పరిస్థితి దాపురించింది. ఏపీలో జగన్‌ ఏలుబడిలో పరిశ్రమలు పారిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు మెరుగ్గా, మరింత ఎక్కువగా పరిశ్రమలు వచ్చాయి. పెట్టుబడులు పెట్టాయి. వాణిజ్య కార్యకలాపాలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమల గురించి ఓ లుక్కేద్దాం రండి.. AP Industrial growth

రాష్ట్రంలో బురదజల్లేమీడియా ఉన్నట్లుగా అభివృద్ధిని చూపించే మీడియా, చానళ్లు, పత్రికలు, వెబ్‌సైట్లు లేకపోవడం శోచనీయం. కియాని మించిన ప్రాజెక్ట్స్ ఈ ప్రభుత్వంలో చాలా వచ్చాయి. కొత్తగా వచ్చిన చాలా పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చివరి దశకు వచ్చాయి. పెప్పర్ లాంటివి ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవన్నీ రెండు ఏళ్లు కరోనాతో ఏ కార్యక్రమాలు జరగకపోయినా.. ఆగిపోలేదు. తన వాడు సీఎం అవ్వాలి అనే ఏకైక దుగ్ధతో ఏం జరగలేదంటూ ప్రచారం చేస్తూ ఆరోపణలు గుప్పించేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి.

ఏపీలో ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన పరిశ్రమల లిస్టు ఇదీ..
గ్రీన్ కో,
పెప్పర్ ఎలక్ట్రిక్ బస్,
NTPC green హైడ్రోజెన్,
Jindal స్టీల్,
లైపిస్ ఫార్మా కాకినాడ,
ఆదిత్య బిర్లా కాస్టిక్ సోడా,
సెంచురీ ప్లై వుడ్‌,
పానాసోనిక్, హవెల్స్,
యాకోహమా టైర్స్,
కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్,
మూలపేట పోర్ట్,
కాకినాడ గేట్ వే పోర్ట్,
రామాయపట్నం పోర్ట్,
మచిలీపట్నం పోర్ట్,
క్రిస్ సిటీ,
బల్క్ డ్రగ్ పార్క్,16 రాష్ట్రాలతో పోటీ పడి సాధించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్,
డైకిన్,
స్మార్ట్ డీవీ,
ఓబేరాయ్ హోటల్స్,
పార్క్ హయత్ హోటల్స్,
లెమన్ ట్రీ హోటల్స్,
మూడు ఇండస్ట్రియల్ కారిడర్స్.
టెక్ బుల్స్,
ఇన్ఫోసిస్,
రాడ్ స్టాండ్,
విప్రో,
అమెజాన్,
ఎనర్జీ రంగంలో లక్ష కోట్ల పైనే పెట్టుబడులు,
ఆదాని డేటా సెంటర్,
రహేజా ఐటీ టవర్, ఇనార్బిట్‌ మాల్,
తాజ్ వివంత హోటల్స్,
అమూల్,
BHEL

Anakapalli: అచ్యుతాపురంలో ఏఐ పరికరాల పరిశ్రమ

ఇవే కాదు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో 17 కొత్త గవర్నమెంట్‌ మెడికల్ కాలేజీలు, 10 షిఫ్ఫింగ్ హార్బర్స్, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి. రాష్ట్రావ్యాప్తంగా 10 వేలకి పైగా సచివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,132 విలేజ్‌ హెల్త్ క్లినిక్స్, పాలకేంద్రాలు.. ఇలా ఎన్నో మన కళ్ల ముందే కనిపిస్తున్న పరిస్థితి. కానీ దుష్ప్రచారం చేసే వారికి ఇవేవీ కనిపించకపోవడం దురదుష్టకరం.

ఎగుమతుల్లో 8వ స్థానం
* 2019–20లో జీఎస్‌డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా తాజాగా 23.36 శాతానికి చేరుకోవడం కళ్లముందే కనిపిస్తోంది.
* వరుసగా మూడేళ్లు నుంచి సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో కొనసాగుతుండడం గమనించాలి.
* పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన లీడ్‌ ఇండెక్స్‌–23లో ఏపీ అగ్ర స్థానంలో టాప్‌ అచీవర్‌గా ఉంది.
* రూ.1.59 లక్షల కోట్ల ఎగుమతులతో ఇండియాలో 6వ స్థానంలో సత్తా చాటిన రాష్ట్రం మనదే.
* 2019 నుంచి రాష్ట్రంలో 130 భారీ, మెగా యూనిట్లు మొదలయ్యాయి.
* ఎగుమతుల సన్నద్ధ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ 8వ పంస్థానానికి చేరుకుంది.

మొత్తంగా రూ.63,754 కోట్ల పెట్టుబడులు, 77,227 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంఎస్‌ఎంఈలు కూడా తోడైతే రాష్ట్రంలో 3,69,831 యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. మొత్తం రూ.14.18 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం కాబోతున్నాయి. ప్రత్యక్షంగా 32,30,425 మందికి, పరోక్షంగా 64,60,850 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాకారం అవుతున్నాయి.

ఇదీ చదవండి: MSME Productvity: రూ.4178 కోట్ల విలువైన పరిశ్రమలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు