HomeTelanganaTelangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే...

Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…

Telangana Voters: అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణలో వాతావరణం హాట్‌ హాట్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల తుది జాబితాను ఇవాళ ప్రకటించింది. మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారన్నది తెలిపింది. Telangana Voters

మరోవైపు ఎన్నికల నేపథ్యంలో అప్పుడే అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య యుద్ధం మొదలైంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నారు. తుంటి గాయం కారణంగా సర్జరీ చేయించుకున్న అనంతరం.. ఇటీవల ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగతంగా రండ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది.

ఇక తెలంగాణ ఓటర్ల విషయానికి వస్తే.. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,30,37,113 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇందులో పురుష ఓటర్లు 1,64,47,132 మంది, మహిళా ఓటర్లు 1,65,87,24 మంది ఉన్నారని తేల్చారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది, సర్వీస్ ఓటర్లు 15,378 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 3,399 మందిగా తేల్చారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 4,54,230 మందిగా తేలారు. దివ్యాంగ ఓటర్లు 5,28,405 మంది ఉన్నారు. తెలంగాణలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,47,726 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడైంది. తెలంగాణలో అత్యల్పంగా భద్రాచలంలో 1,51,940 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య కాస్త పెరిగిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్షన్ కమిషన్‌ తాజాగా తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఈసీ పేర్కొంది. పురుషులు 1 కోటి 64 లక్షల 47 లక్షల132 మంది ఉన్నట్టు తెలిపింది.

మహిళా ఓటర్లు 1 కోటి 65 లక్షల 87 వేల 244 మంది ఉన్నట్టు తేలింది. థర్డ్ జెండర్ ఓటర్లు 2 వేల 737 మంది ఉన్నట్టు సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ఇదీ చదవండి: Reddy Politics: తెలంగాణలో హీరోలు..! ఏపీలో విలన్లు!! రెడ్డి ప్రజా ప్రతినిధులపై ఆ మీడియా తీరిదీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు