HomeAndhra PradeshIRR Scam: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్

IRR Scam: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో కీలక పరిణామం.. ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్

IRR Scam: రాజధాని ఇన్నర్‌ రింగురోడ్డు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ ఇందుకు సంబంధించి చార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీఐడీ.. ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీమంత్రి నారాయణను పేర్కొంది. నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, రమేష్ లను ముద్దాయిలుగా ఏపీ సీఐడీ పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని సీఐడీ అభియోగాల్లో తెలిపింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించారని సీఐడీ చార్జ్‌ షీట్‌లో పేర్కొంది. IRR Scam

సింగపూర్ తో ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని సీఐడీ అధికారులు తేల్చారు. చట్ట విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్ కు డబ్బు చెల్లింపులు జరిగినట్లు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్‌లు రూపొందించినట్లు సీఐడీ పేర్కొంది. లింగమనేని, హెరిటేజ్, నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్ ని మార్చినట్లు ఛార్జ్‌షీట్ లో సీఐడీ వెల్లడించింది.

58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారని, లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కు మేలు చేసేలా అలైన్‌‌మెంట్ మార్పులు చేశారని సీఐడీ అభియోగాల్లో పేర్కొంది. దీంతో లింగమనేని చంద్రబాబుకు ఇల్లు ఇచ్చినట్లు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాలు కొన్నట్లు సీఐడీ పేర్కొంది. ఈ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చినట్లు నిర్ధారణకు సీఐడీ వచ్చింది.

చంద్రబాబు, నారాయణ, లోకేష్,లింగమనేనితో పాటు రాజశేఖర్ ను నిందితులుగా చేర్చింది. అనుచితంగా లబ్ధిపొందాలని చూశారని సీఐడీ పేర్కొంది. చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరిగిందని సీఐడీ పేర్కొంది.

read also: YS Jagan fire on Babu: డ్వాక్రా సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర

Junior NTR Flex: జూనియర్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్‌ చేసిన చంద్రబాబు? బాలయ్య చేష్టలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు