Sharmila on YS Jagan: ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి, దివంగత వైయస్సార్ తనయ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో అన్న జగన్‌పై, చంద్రబాబుపై, బీజేపీపై తీవ్ర విమర్శలతో హల్ చల్ చేశారు. విజయవాడలోని కానూరు కల్యాణ మండపంలో షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. (Sharmila on YS Jagan) షర్మిల ఏమన్నారంటే..
* నన్ను నమ్మి నాకు బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు
* కాంగ్రెస్ కార్యకర్తలు నాపై నమ్మకం పెట్టుకున్నారు
* గడిచిన పదేళ్లలో ఏపీలో అభివృద్ధి జరగలేదు
* చంద్రబాబు హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది
* జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఆ అప్పులు మరింత పెరిగాయి
* ఏపీకి రాజధాని ఉందా ?
* పదేళ్లలో 10 పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు
* పదేళ్లు అయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు
* రాజధాని కట్టడానికి కూడా డబ్బుల్లేవు
* ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి
* ఏపీలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం
* రాష్ట్రంలో మైనింగ్, ఇసుక మాఫీయా రెచ్చిపోతుంది
* ఏపీలో కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకువస్తాం : వైఎస్ షర్మిల
* రాష్ట్రంలో రోడ్లు వెయ్యడానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు
* రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం..దాచుకోవడమే
* రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయి
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేతకాలేదు
* ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవి
* కేంద్రంలో భాజపాతో పొత్తులో ఉండికూడా చంద్రబాబు ప్రత్యేక హోదా తెలేకపోయారు
* ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామ చేస్తామన్నారు
* కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేశారా?
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం చంద్రబాబు, జగన్ దే
* చంద్రబాబు అమరావతి పేరిట 3డీ గ్రాఫిక్స్ చూపించారు
* జగన్ మూడు రాజధానులు అని ఒక్కటీకూడా కట్టలేదు
* రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా చేశారు
* బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చింది
* భాజపా పాలనలో రైతుల అప్పులపాలయ్యారు
* వాళ్ల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టింది
* ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు, జగన్
* చంద్రబాబు పాలనలో రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేశారు
* సీఎం జగన్ 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు
* ఇప్పుడు ఏపీకి ఆరున్నర లక్షల కోట్ల అప్పులున్నాయి
* కార్పొరేషన్ల లోన్లు కలుపుకుంటే ఏపీపై రూ. 10 లక్షల కోట్ల భారం ఉంది
* టీడీపీ, వైసీపీ దొందు దొందే
* అమరావతిని సింగపూర్ చేస్తానని త్రీడీ గ్రాఫిక్స్ చూపించారు
* జగన్ మూడు రాజధానులు అన్నారు, ఒక్కటీ కాలేదు
* ఏపీలో వైసీపీ, టీడీపీ పాలనలో అభివృద్ధి జరిగిందా ?
* దళితులపై దాడులు విచ్చలవిడిగా పెరిగాయి
* రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అప్పు రూ. లక్ష కోట్లు
* ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చారు .. అక్కడ పరిశ్రమలు వచ్చాయి
* ఏపీకి ప్రత్యేక హోదా తేవడంలో పాలకులు విఫలమయ్యారు
* ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఉద్యమం చేయలేదు
* వైఎస్సార్ చనిపోయాక పోలవరం ఒక్క అడుగూ ముందుకు పడలేదు
* బీజేపీ తో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టారు
* ఏపీ రాజధానిని కట్టారా ?
* ఏపీలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా ?
* అప్పులేని రైతు ఉన్నారా ?
* స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతామని బీజేపీ చెప్పింది
* రూపాయి అయినా పేదలకు బీజేపీ ప్రభుత్వం పంచిందా ?
* బీజేపీ తో వైసీపీ, టీడీపీ దోస్తీ ఎందుకు చేయాలి ?
* టీడీపీ, వైసీపీ ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు
* బీజేపీ వాళ్లు ఏం చెబితే వీళ్లు అది చేస్తారు
* వైసీపీ, టీడీపీ కి ఓటు వేసిన ఆ ఓటు బీజేపీ కే వెళ్తుంది
* రాజశేఖర్ రెడ్డిని అభిమానించే నాయకులు అయినా ప్రజలైనా నాతో చేతులు కలపండి : వైఎస్ షర్మిల
* రాష్ట్రంలో దళితుల మీద 100శాతం దాడులు జరిగాయి
* భూతద్దంలో చూసినా ఏపిలో అభివృద్ధి కనిపించడంలేదు
* పదేళ్లలో ప్రత్యేక హోదా తీసుకురాగలిగారా
* బీజేపితో దోస్తీ కోసం పోలవరాన్ని టిడిపి, వైసిపి తాకట్టు పెట్టాయి.
* ఏపిలో ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేదు
* బీజేపికి అమ్ముడుపోయే దానికి ఇన్ని జెండాలు ఎందుకు?
* టిడిపి, వైసిపి కూడా బిజేపి జెండాలే పెట్టుకుంటే సరిపోతుంది కదా?
ఇదీ చదవండి: Ambedkar Statue: దేశానికే తలమానికం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం.. సీఎం జగన్ సందేశం
