శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Andhra Pradesh

Sajjala comments on Sharmila: షర్మిల మాట్లాడిన భాష, హడావుడి చూస్తే జాలి కలుగుతోంది..

ప్రచురణ తేదీ: ఆదివారం, 21 జనవరి 2024

Sajjala comments on Sharmila: షర్మిలను చూస్తుంటే జాలి కలుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్‌ చేశారు. తమ పార్టీపై షర్మిల కామెంట్స్‌ అనంతరం సజ్జల స్పందించి మీడియాతో మాట్లాడారు. ఇదంతా చంద్రబాబు పనేనని, చంద్రబాబు చివరి అస్త్రమే షర్మిల అని సజ్జల కామెంట్ చేశారు. వైయస్సార్‌ ఆశయాలకు కట్టుబడి సీఎం జగన్‌ పాలన సాగుతోందని స్పష్టీకరించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. (Sajjala comments on Sharmila)

* వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా జగన్ పనిచేస్తున్నారు
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసింది
* వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టింది
* జగన్ పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు

* కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిల కు ఏం తెలుసు ?
* వైఎస్సార్ మరణానంతరం అయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది
* షర్మిల నిన్నటి వరకు తెలంగాణ లో ఏం చేశారు ?
* షర్మిల .. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు
* రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్. షర్మిల ఏపీకి వచ్చి ఏం చేస్తారు

* ఆపార్టీ తరపున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు ?
* చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది
* గత ఎన్నికల్లో నోటా కన్న తక్కువ ఓట్లు వచ్చాయి
* చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది

* తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిల ను ఎందుకు గుర్తించలేదు
* తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు
* ప్రత్యేక హోదా కోసం వైఎసార్సీపీ పోరాడుతూనే ఉంది
* షర్మిల ను చూస్తే జాలి కలుగుతుంది
* చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిల నే

* ప్రత్యేక హోదాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చట్టంలో చేర్చలేదు
* షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే
* ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు
* ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే

* అందుకే ఆ వర్గం మీడియా షర్మిల ను భుజానికి ఎత్తుకుంది
* వైఎస్సార్ వారసుడిగా ప్రజల హృదయాల్లో జగన్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
* వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంత వేధించిందో అందరికీ తెలుసు

* షర్మిల మాట్లాడిన భాష,చేసిన హడావుడి చూశాక జాలి కలుగుతోంది
* రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు
* వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రేస్సే
* జగన్ ను జైలుకు పంపించింది కాంగ్రెస్ పార్టీనే
* కాంగ్రెస్ లోకి చేరగానే షర్మిల భాష, యాస మారింది

* షర్మిల వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో అర్ధం కాని పరిస్ధితి
* అన్నకోసం ఒకప్పుడు పార్టీలో తనవంతు పాత్ర పోషించారు
* ఇప్పుడు అదే జగన్ ను షర్మిల నేరుగా తిడుతున్నారు

* తెలంగాణలో షర్మిల ఏం చేశారు…ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారు
* నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్ కి రాలేదు
* ఆమె ఇప్పుడు కొత్తగా వచ్చి చేసేదేం లేదు
* చంద్రబాబును సిఎం చేయడమే ఆమె లక్ష్యంలా ఉంది

read also: Sharmila on YS Jagan: వచ్చీ రాగానే అన్నను టార్గెట్‌ చేసిన షర్మిల.. పీసీసీ చీఫ్‌గా తొలిరోజే వైసీపీ, టీడీపీ, బీజేపీపై విమర్శల బాణాలు

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading