Leftover Eligible Beneficiaries: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశాన్ని ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. వారి ఖాతాల్లో ఇవాళ నిధులు జమ చేశారు సీఎం జగన్. క్యాంపు కార్యాలయంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. (Leftover Eligible Beneficiaries)
* ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది.
* నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంపతృప్తినిచ్చే కార్యక్రమం.
* ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వారి తరఫున, మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉందని భరోసా కల్పించే కార్యక్రమం.
* ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటున ఏ పథకం అయినా అందకపోతే, అర్హత ఉండి కూడా పథకం అందకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టించి, వెరిఫికేషన్ చేయించి ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ నష్టపోకుండా లబ్ధిని అందజేసే ఒక మంచి కార్యక్రమం.
* ఇది మనందరికీ ఎంతో సంతృప్తినిస్తూ ప్రభుత్వం తోడుగా నిలబడుతోందని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీని వల్ల జరుగుతుంది.
* ఈ పథకం ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా జూన్-జూలైలో ఒకసారి, మళ్లీ డిసెంబర్-జనవరిలో మరోసారి.. ఇలా 6 నెలలకు సంబంధించిన పథకాల్లో అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి తోడుగా నిలుస్తున్నాం.
* దరఖాస్తు చేసుకోకపోయి ఉండటం, ఏదైనా పొరపాట్లు దొర్లడం వల్ల, కావాల్సిన పత్రాలు ఇవ్వని పరిస్థితులు, ఆధార్-బ్యాంక్ అకౌంటు మిస్ మ్యాచ్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల పథకం బెనిఫిట్ రాని పరిస్థితి ఉంటే వాళ్లందరికీ ప్రతి ఆరు నెలలకోసారి పథకాలకు సంబంధించి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం.
* 2021 డిసెంబర్‌లో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఆరు నెలలకోసారి చేస్తున్నాం. ఈరోజు ఐదోసారి చేస్తున్నాం.
* అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ తోడుగా ఉంటూ నిలబడుతూ దాదాపు రూ.1,700 కోట్లు వారికి అందజేసే కార్యక్రమం.
* ఈరోజు దాదాపు వివిధ పథకాలకు సంబంధించి 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వారికి మళ్లీ అందజేస్తూ రూ.98 కోట్లకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో అందేట్టుగా చేస్తున్నాం.
* అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఇంతకు ముందు పథకం తీసుకొచ్చినప్పుడు 42.62 లక్షల మంది అర్హత పొందారు. డబ్బులు ఖాతాల్లో పడ్డాయి.
* మిస్ ఔట్ అయిపోయిన 40,616 మంది ఉంటే వారికి కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ పూర్తి కావడం వారికి మళ్లీ వెనక్కి వచ్చేట్టుగా చేస్తున్నాం.
* జగనన్న చేదోడులో అప్పట్లో 3.25 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 15 వేల మంది మిస్ ఔట్ అయిన వారికి ఇస్తున్నాం.
* ఈబీసీ నేస్తం ద్వారా 4.40 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 4,180 మందికి లబ్ధి జరిగిస్తున్నాం.
* వైయస్సార్ వాహన మిత్ర ద్వారా 2.80 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు మళ్లీ 3,030 మందికి ఈరోజు మంచి జరగబోతోంది.
* మత్స్యకార భరోసా కింద అప్పట్లో 1.20 లక్షల మందికి మంచి జరిగితే ఈరోజు మరో 2 వేల మందికి మంచి జరిగిస్తున్నాం.
* కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అప్పట్లో 29,934 మందికి మంచి జరిగితే 1,912 మందికి మిగిలిపోయిన వారికి మళ్లీ ఈరోజు మంచి జరిగిస్తున్నాం.
* వైయస్సార్ కాపు నేస్తం 3.60 లక్షలమందికి అప్పట్లో మంచి జరిగితే, ఇప్పుడు 1884 మందికి మంచి జరిగిస్తున్నాం.
* నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగింది. ఇప్పుడు 352 మందికి మంచి జరిగిస్తున్నాం.
* వీళ్లే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం.
* ఎవరైనా మిగిలిపోయినా, కొత్తవాళ్లెవరైనా దరఖాస్తు చేసుకోవడం, వెరిఫై చేసి మంజూరు చేయడం, మంజూరు చేసిన వారికి ప్రతి 6 నెలలకు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం జరుగుతోంది.
* మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులు ఈనెల నుంచే వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది.
* 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం.
* ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, శాచురేషన్ పద్ధతిలో వివక్ష, లంచాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం.
* పథకం అయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకొనే వెసులుబాటు కల్పిస్తూ, వాలంటీర్ సేవలు అందుబాటులో ఉంచడం, సచివాలయంలోకి వారే వెళ్లి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు, 1902కు ఫోన్ చేసినా వాళ్లు గైడెన్స్ ఇస్తున్నారు.
* ఇవన్నీ కూడా గవర్నమెంట్‌లో ఒక జవాబుదారీ తనం, ఒక ట్రాన్స్ పరెన్సీ, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న భావన, తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పే సంకేతం.
* ప్రతి 6 నెలలకోసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వంతోడుగా ఉందని ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ కార్యక్రమం పని చేస్తుంది.
* కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ధ్యాస పెట్టి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వాళ్లందరికీ తోడుగా నిలబడి, సహాయ సహకారాలు అందిస్తున్నారు.
* వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం.
ఇదీ చదవండి: ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం
