YSR Pension Kanuka: ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం జగన్ మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. అవ్వాతాతల పింఛన్ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీని నెరవేరుస్తూ జనవరి 2024 నుంచి పింఛన్ రూ.3,000 అందిచనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సర కానుకగా పింఛన్ పెంపు అవ్వాతాతల కోసం అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. (YSR Pension Kanuka)
వైయస్సార్ పింఛన్ కానుక కింద ఠంచనుగా పింఛన్ అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇకపై లబ్ధిదారులు ప్రతినెలా రూ.3 వేలు అందుకోనున్నారు.
* 2014-19లో గత పాలనలో పెన్షన్ రూ.1000
* జూలై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు.
* జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు.
* జనవరి 2023న రూ. 2,750కు పెంపు.
* జనవరి 2024న రూ.3వేలకు పెంపు.
* 2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400 కోట్లు.
* జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు.
* జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు.
* జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు.
* జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1968 కోట్లు.
* గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు రూ.27,687 కోట్లు మాత్రమే.
* ఇచ్చిన మాట ప్రకారం ఈప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు.
* గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు.
* 2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు.
* 2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు.
* 2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు.
* 2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు.
* గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్ల్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు.
* గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్న కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది.
* నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో బై యాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు.
* పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది.
* 2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలొ ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000
* ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు మరియు ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం.
* గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం.
