HomeAndhra PradeshAdudham Andhra programme: క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సాయం.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Adudham Andhra programme: క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సాయం.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Adudham Andhra programme: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభించారు. గుంటూరులో ఈ కార్యక్రమం లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్‌.. క్రీడల విశిష్టతను, వ్యాయామం వల్ల జరిగే ప్రయోనాలను వివరించారు. ఈ కార్యక్రమ ఉద్దేశాలను వెల్లడించారు. (Adudham Andhra programme) సీఎం జగన్‌ ప్రసంగం ఇదీ..

* ఈరోజు నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నా.
* ఈరోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది.
* ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా హిస్టరీలో నిలబడిపోతుంది.
* ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్‌ చేయాలని ప్రయత్నిస్తోంది.

* ఒకటి.. ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ వ్యాయామం, స్పోర్ట్స్‌ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయం ఒక అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌గా ఉపయోగపడుతుంది.
* ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరం అని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్‌గా ఉపయోగపడుతుంది.
* క్రమంత ప్పకుండా కచ్చితంగా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల బ్లడ్‌ ప్రజర్‌లాంటివి కంట్రోల్‌లో ఉంచగలుగుతాం.
* టైప్‌2 డయాబెటిస్‌ లాంటివి నిరోధించడంలో క్రియాశీలకంగా స్పోర్ట్స్‌ పని చేస్తుంది.
* వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది.

* విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్‌ కేర్‌మీద దేశం మొత్తం గర్వపడేలా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడుతున్నాయి.
* ఇందులో భాగంగానే వ్యాయామం ఎంతో అవసరం అన్నది కూడా గ్రామస్థాయిలోకి మెసేజ్‌ తీసుకొనిపోయే గొప్ప కార్యక్రమం ఇది.
* టీబీ ఎక్కువయిందంటే గుండెపోటుకు చెందిన అనేక రకాల రోగాలు వస్తాయి.
* షుగర్‌ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రోగాలు వస్తాయి.
* ఇటువంటివన్నీ కంట్రోల్‌లో ఉండాలి అంటే, రాకుండా జాగ్రత్తలు పడాలంటే కచ్చితంగా గ్రామ స్థాయిలో వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.
* గ్రామ స్థాయి నుంచే ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తున్నాం.

* రెండో ముఖ్యమైన ఆబ్జెక్టివ్‌.. స్పోర్ట్స్‌ ఆడించే కార్యక్రమం సచివాలయం నుంచి మొదలు పెడితే.. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలన్నీ నిర్వహించడం జరుగుతుంది.
* ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం
* ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి లేకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా మన పిల్లలను పరిచయం చేయడం.
* ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయికి టీమ్‌లు వస్తాయో, మన టీమ్‌లను చూసేందుకు, ఆణిముత్యాలను వెతికేందుకు ఏకంగా ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఉన్న టీములన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయి.
* ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సాయంగా ఉండేందుకు వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి టీములు ముందుకొచ్చాయి.

* క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకొచ్చింది.
* ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు వాళ్లు కూడా ముందుకొచ్చారు.
* నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెసనల్‌ లెవల్‌లో వీళ్లంతా పార్టిసిపేట్‌ చేస్తారు.
* బ్యాడ్మింటన్‌కు సంబంధించి నాతోపాటు ఇక్కడే శ్రీకాంత్‌ ఉన్నాడు. సింధు కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది.
* వీళ్లకు మన రాష్ట్రంలో ఒకరికి విశాఖలో ల్యాండ్‌, ఇంకొకరికి తిరుపతిలో ఇచ్చాం.
* బ్యాడ్మింటన్‌ అకాడమీస్‌ కూడా అక్కడ వీళ్లు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది.
* వీళ్లు కూడా మెంటార్లుగా మన ట్యాలెంట్‌ను గుర్తించడంలో, సానపట్టి వజ్రాలుగా మలచడంలో మన పిల్లలందరికీ తోడుగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషకరం.

* వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్‌, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు రావడం జరిగింది.
* రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్లంతా కలిసి పని చేస్తారు.
* ఈ కార్యక్రమం ఇక మీదట నుంచి ప్రతి సంవత్సరం కూడాజరుగుతుందని ఈ సందర్భంగా చెబుతున్నా.
* ప్రతి సంవత్సరం ఇదే మాసాల్లో ఇదే మాదిరిగా గ్రామస్థాయి నుంచి మొదలై, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి.
* గ్రామాల్లో అవేర్‌నెస్‌ క్రియేట్‌ అవుతుంది. ఆరోగ్యపరమైన అవేర్‌నెస్‌, మరో రకంగా ట్యాలెంట్‌ హంట్‌ కార్యక్రమం కూడా గ్రామస్థాయిలో చర్చనీయాంశమవుతుంది.
* మరిన్ని ఆణిముత్యాలు మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం జరుగుతుంది.

* సచివాలయం స్థాయి, మండల స్థాయి నుంచి కిట్లు ఇవ్వడం జరుగుతోంది.
* నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్‌ కిట్లు ఇవ్వడం జరుగుతుంది.
* ప్రతి సంవత్సరం కిట్లు ఇస్తూ మన పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది.
* ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
* 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేసేందుకు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
* 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌చేయింకొని మన పిల్లలకు తోడుగా ఉండేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

* 15 వేల సచివాలయాల పరిధిలో, ఇప్పటికే 9 వేల ప్లే గ్రౌండ్లు గుర్తించడం జరిగింది.
* ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్‌ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను గుర్తించడం జరిగింది.
* రాబోయే సంవత్సరాల్లో అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ప్రతి స్కూల్లోనూ ఎంకరేజ్‌ చేసేలా అడుగులు పడతాయి.
* స్కూళ్ల దాకా కిట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటూ పోతాం.
* మీ అందరికీ ఆల్‌ ద వెరీ బెస్ట్‌ విషెస్‌ మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.

ఇదీ చదవండి: CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు