Suliyari: మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో ఏపీఎండీసీఎస్ ఏర్పాటు చేసిన పబ్లిక్ స్కూల్, హెల్త్ సెంటర్ల నిర్వహణపై దయానంద్ ఆంగ్లో వేదిక్ (DAV) సొసైటీ, HLL లైఫ్ కేర్ సంస్థలతో కీలక ఒప్పందం కుదిరింది. ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. (Suliyari)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఏపీఎండీసీ మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ ప్రాంతంలో బొగ్గుగనులను నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 1450 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సులియారి బొగ్గు గని ద్వారా, సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యంతో బొగ్గు నిల్వలను అందిస్తోంది. దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కీలక ఇంధన వనరులను సమకూరుస్తోంది. సుల్యారీ బొగ్గు నిల్వల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ ద్వారా 60 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.
బొగ్గు గనుల నిర్వహణలో భాగంగా ఈ ప్రాంతంలో నిర్వాసితులైన ప్రజల పునరావాసంకు, వారి జీవనప్రమాణాలను మరింత మెరుగుపచడానికి ఏపీఎండీసీ కృషి చేస్తోంది. ఈ ప్రాంతలోని ప్రజలకు పునరావాస కాలనీలు, రహదారులు, కాలువలు, రక్షిత మంచినీటి సరఫరా, కమ్యూనిటీ హాళ్ళు, పాఠశాల, వైద్యశాల, మురుగునీటి శుద్ది ప్లాంట్, పచ్చదనంను పెంపొందించే చర్యలను ప్రణాళికాబద్దంగా చేపట్టి, అమలు చేస్తోంది. యువత, మహిళలకు నైపూణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారిలో ఆర్థిక స్వావలంభన, ఉపాధికి చేయూతను అందిస్తోంది.
సామాజిక బాధ్యతా చర్యల్లో భాగంగా సుల్యారీలో ఏపీఎండీసీ అన్ని వసతులతో కూడిన ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ ను నిర్మించింది. ఈ స్కూల్ నిర్వహణకు దేశంలోనే అడకమిక్ ఎక్స్ లెన్స్ కు ప్రసిద్ది చెందిన ‘’దయానంద్ ఆంగ్లో వేదిక్ (DAV) ట్రస్ట్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎపిఎండిసి-డిఎవి స్కూల్ ద్వారా విద్యార్ధులకు ఆధునిక ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూంలు, ప్లే గ్రౌండ్స్, ఆందుబాటులో క్రీడాపరికరాలును సమకూర్చడం ద్వారా ఈ ప్రాంతంలో విద్యాప్రమాణాలను వికసింపచేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. మైనింగ్ కోసం ఇతర ప్రాంతాలకు తరలించిన కుటుంబాలకు ఈ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యావసతిని అందుబాటులో తీసుకువచ్చింది. చక్కని విద్యతో ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు భవిష్యత్తులో ప్రగతిపధంలో పయనించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.
నామమాత్రంగా వైద్య సదుపాయాలు ఉన్న సుల్యారీలో ఎపిఎండిసి సామాజిక బాధ్యతగా అన్ని ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిని నిర్మించింది. ఈ ఆసుపత్రిని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని CPSE అయిన HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ కలిసి ఎపిఎండిసి నిర్వహించనుంది. ఆర్థోపెడిక్, గైనకాలజీ సౌకర్యాలతో కూడిన 24×7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఆసుపత్రిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు పటిష్టమైన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS)ను ఏర్పాటు చేశారు.
సుల్యారీ బొగ్గుగనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గులో 25 శాతంను స్థానికంగా ఉన్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) కేటాయించడం ద్వారా పారిశ్రామిక అభివృద్దికి చేయూతను అందిస్తున్నారు. APMDC VC & MD, వెంకటరెడ్డి, DAV, HLLలతో APMDC వ్యూహాత్మక సహకారం సులియారిలో విద్య, వైద్యం, ఆర్థిక సాధికారతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: Mega Arogya sri: మెగా ఆరోగ్యశ్రీ క్యాంపెయిన్‌లో ఏమేం చేస్తారంటే.. ఆరోగ్యశ్రీ వినియోగంపై పూర్తి వివరాలు ఇవీ..
