HomeAndhra PradeshJVVD: జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్‌ సర్వీస్‌ ప్రోత్సాహకం విడుదల

JVVD: జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్‌ సర్వీస్‌ ప్రోత్సాహకం విడుదల

JVVD: పేద విద్యార్థులకు కూడా విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఏపీ సర్కార్‌ కల్పిస్తోంది. అలాగే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అందిస్తోంది. (JVVD)

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను నేడు సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సా సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలను.. మొత్తం రూ. 42.60 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు.

సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం

సివిల్ సర్వీస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ. 1 లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ. 50 వేల ప్రోత్సాహకం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతో పాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. ఎలాంటి పరిమితి లేకుండా అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది.

గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలు చేశారు. జగన్‌ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావు లేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధి చేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది.

విదేశీ విద్యాదీవెన

కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలును ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ / టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలలో టాప్-50 ర్యాంకుల్లో ఉన్న కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తోంది. విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా.. దీని ద్వారా ప్రపంచంలోని టాప్ 320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతోంది.

గడిచిన 10 నెలల్లో కేవలం “జగనన్న విదేశీ విద్యాదీవెన” కింద 408 మంది విద్యార్థులకు అందించిన ఆర్థిక సాయం మొత్తం రూ. 107.08 కోట్లు అందించింది ఏపీ ప్రభుత్వం.

మరిన్ని వివరాల కోసం https://jnanabhumi.ap.gov.in ను సందర్శించాలి.

ఇదీ చదవండి: Suliyari: సుల్యారీలో ఆధునిక ప్రమాణాలతో స్కూల్‌.. కీలక ఒప్పందం ఖరారు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు