Mega Arogya sri: ఏపీలో ఆరోగ్యశ్రీపై విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా రూ.25 లక్షల దాకా విలువైన వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారందరూ ఇందుకు అర్హులే. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. మెగా ఆరోగ్యశ్రీ క్యాంపెయిన్‌కు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నిన్నటి సమావేశంలో సీఎం జగన్ పూర్తి సారాంశం, ఆరోగ్యశ్రీ వినియోగంపై అవగాహనపై వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. (Mega Arogya sri)
క్యాంప్ కార్యాలయం నుంచి మెగా ఆరోగ్యశ్రీ అవేర్‌నెస్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్ జగన్ కామెంట్స్.. (Mega Arogya sri)
* ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయం, సచివాలయంలో పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్, అక్కడ పని చేస్తున్న వాలంటీర్లు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరుగుతోంది. (Mega Arogya sri)
* ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారరిత్రాత్మక ఘటన.
* దేశంలో బహుశా ఎక్కడా జరగని విధంగా గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తున్నాం.
* వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ ఉండకూడదన్న తలంపు, తాపత్రయంతో ఆరోగ్యశ్రీని ఎప్పుడూ ఎవరూ చూడనంత మార్పులు తీసుకొస్తూ ముందడుడు వేస్తున్నాం.
* వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.
* దానిపై పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎవరిని అడగాలి ఇలాంటి ప్రతి డౌటునూ ఎవరి మనసులోనూ లేకుండా క్లియర్ చేయాలి.
* ప్రతి ఇంటికీ వెళ్లి కార్డుల డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏరకంగా పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా లేకుండా ఎలా వైద్యం పొందవచ్చనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
* ఆరోగ్యశ్రీలో జరుగుతున్న మార్పులు చాలా విప్లవాత్మకమైనవి.
* మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికీ విస్తరించాలనే తనప తాపత్రయంతో అడుగులు పడ్డాయి.
* బిలో పావర్టీ మాత్రమే కాకుండా నెలకు రూ.40 వేల ఆదాయం వస్తున్న కుటుంబాలు కూడా అంటే రూ.5 లక్షలు సంవత్సరానికి ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.
* దీని వల్ల అక్షరాలా కోటీ 48 లక్షల కుటుంబాలు అంటే 4.25 కోట్ల జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.
* మనం అధికారంలోకి రాక ముందు కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమై ఉండేది.
* అధికారంలోకి మనం వచ్చిన తర్వాత రూ.1000 చికిత్స ఖర్చు దాటితే చాలు పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి ఉండకూడదని తపన, తాపత్రయంతో ప్రతి అడుగులో కనిపిస్తూ ఈ ప్రొసీజర్లను పెంచుకుంటూ, సంవత్సరంలో 2300కు తీసుకుపోయాం.
* ఈరోజు 3257 ప్రొసీజర్లతో ఈరోజు నడిపిస్తున్నాం.
* మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2513 ఆస్పత్రులకు విస్తరించడం జరిగింది.
* మన రాష్ట్రంలోనే 2309 ఆస్పత్రులకు అవైల్ చేస్తుంటే హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎక్కడున్నాయో, బెస్ట్ వైద్యం పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో 85 ఆస్పత్రులు, బెంగళూరు 35 ఆస్పత్రులు, చెన్నై నగరంలో 16 ఆస్పత్రులు, మొత్తంగా 204 బయట రాష్ట్రాల్లో ఆస్పత్రులను ఎంపానల్ చేశాం.
* గతంలో మాదిరి కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
* 820 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆస్పత్రులను 2543 ఆస్పత్రులకు విస్తరించాం.
* ఒకవైపున చికిత్సల సంఖ్యలను పెంచడం, మరోవైపు ఆదాయపు పరిమితిని పెంచి ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం
* మూడోది 25 లక్షల దాకా ఖర్చయ్యేచికిత్సలను ఆరోగ్యశ్రీలోకి తీసుకొని రావడం.
* ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి గమనించాలి.
* 2014-19 అప్పటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీగానీ, ఆరోగ్య ఆసరా అప్పుడు ఎలాగూ లేదు. ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసింది 5171 కోట్లు మాత్రమే. సంవత్సరానికి 1034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి.
* అదే ఈరోజు అక్షరాలా ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్న అమౌంట్ సంవత్సరానికి 4100 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా రెండూ కలిపితే 4100 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
* ప్రతి సంవత్సరం మనం ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటి 14439 కోట్లు ఖర్చు చేశాం.
* 104, 108 కూడా కలుపుకుంటే ఇది సంవత్సరానికి 4400 కోట్లు కేవలం పేదవాడి కోసం, పేదవాడు అప్పులపాలు అయ్యే పరిస్థితిరాకూడదు, వైద్యం కోసం ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదనే తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి.
* గతంలో ఆరోగ్యశ్రీ సేవలందుకుంటున్న వారు ఐదేళ్లు కలిపి 22,32,000 మందికి మాత్రమే.
* ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవలు 53 లక్షల మందికి సేవలందుతున్నాయి.
* పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా డాక్టర్లు పేదవాడు రెస్టు తీసుకోవాలని చెబితే, ఆరోజులు పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని రోజులపాటు నెలకు 5 వేలచొప్పున, పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం ఆరోగ్య ఆసరా ద్వారా జరుగుతోంది.
* దీని ద్వారా 25,27,870 మందికి 1309 కోట్లు ఇవ్వడం జరిగింది.
* ఆరోగ్యశ్రీ కింద గతంలో ఎవరికైనా క్యాన్సర్ లాంటి భయానక రోగం వస్తే కేవలం 5 లక్షలు దాటితే ఇచ్చేది లేదు, ఐదు లక్షలు మాత్రమే అని కన్ఫయిన్ చేసిన పరిస్థితులు.
* కీమో తెరపీ లాంటివి మొదలు పెట్టినా రెండు డోసులు, మూడు డోసులకే 5 లక్షలు అయిపోయింది వైద్యం చేయలేం, ఆరోగ్యశ్రీ అయిపోయిందని వెనక్కు పంపిన పరిస్థితులు.
* మళ్లీ ఆరు నెలల తర్వాత ఆ బాధితునికి క్యాన్సర్ రీల్యాప్స్ అయి మళ్లీ రావడం, వైద్యం లేక ఆ పేదవాడు చనిపోవడం.
* ఈ పరిస్థితులను పూర్తిగా మారుస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సర్‌కు ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు. అన్‌లిమిటెడ్‌గా పూర్తిగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టాం.
* రెండు చెవులకూ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడానికి 12 లక్షలు అవుతుందంటే అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.
* బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రెమ్‌షెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 11 లక్షలు, గుండెమార్పిడి చికిత్స 11 లక్షలుపైనే అంటువంటివన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది.
* ప్రాణాంతకమైన ఈ వ్యాధులు దాదాపు 182732 మందికి ఆరోగ్యశ్రీలో ఇటువంటి పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లు సైతం ఇవన్నీ ఉచితంగా చేస్తూ తోడుగా నిలబడగలిగాం.
* ఒక్క క్యాన్సర్‌కే ఏకంగా 1900 కోట్లు ఖర్చు చేసి పేదవాడికి తోడుగా నిలబడగలిగాం.
* ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా గతంలో 104, 108 ఎక్కడున్నాయో తెలియదు, వస్తాయో రావో తెలియదు, ఫోన్ కొట్టినా లాంభం లేదనే పరిస్థితి.
* గతంలో కేవలం 108 వాహనాలు 336 వాహనాలే.అంటే మండలానికి ఒకటి కూడా వాహనం లేదు.
* 104 అయితే కేవలంం 292 వాహనాలు. అన్నీ కలిపినా 622 వాహనాలు. అవికూడా సరిగ్గా పని చేయని పరిస్థితి.
* ఈరోజు ఏకంగా 108లో 768 వాహనాలు, 104లో 936 వాహనాలు, రెండూ కలిపితే 1704 వాహనాలు ఈరోజు తిరుగుతున్నాయి.
* తల్లీ బిడ్డ కలుపుకుంటే 500 కలుపుకుంటే 2204 వాహనాలు ఈరోజు కేవలం పేదవాడి కోసం వారికి ఎక్కడ ఏం అవసరం వచ్చినా వారికి అండగా, తోడుగా నిలబడేందుకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
* ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మార్పులు జరుగుతున్నాయి.
* మనం అధికారంలోకి రాక ముందు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11.
* ఈరోజు ఏకంగా మరో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో కట్టబడుతున్నాయి.
* మొత్తంగా 28 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి.
* ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేశాం. ఒక మెడికల్ కాలేజీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
* మెడికల్ కాలేజీ వల్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు. ప్రొఫెసర్లు ఉంటారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కింద పేదవాడికి సాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ.
* అటువంటివి మనం అధికారంలోకి వచ్చాక అడుగులు పడ్డాయి.
* గవర్నమెంట్ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు ఉండరు, పోయినా వేస్టే అన్న పరిస్థితులు మార్చాం.
* గతంలో ఎప్పుడూ చూడని విధంగా 53,126 మందిని తీసుకొచ్చి డ్రైవ్ కింద పెట్టి రిక్రూట్ చేశాం.
* కచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా అడుగులు పడుతున్నాయి.
* స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో 61 శాతం కొరత.
* మన రాష్ట్రంలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 3.96 శాతం.
* ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా ఎంత డబ్బు ఖర్చయినా తీసుకోవాలని పేపర్లలో యాడ్స్ ఇచ్చి రిపీటెడ్‌గా రిక్రూట్ చేస్తున్నాం.
* 27 శాతం జాతీయ సగటున నర్సుల కొరత ఉంది. మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా? సున్నా. 100 శాతం ప్యాక్
* ల్యాబ్ టెక్నీషియన్ల కొరత జాతీయ సగటున 33 శాతం. అదే మన రాష్ట్రంలో కొరత సున్నా. 100 శాతం ప్యాక్
* ఈరోజు గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు పోతే మందులే ఉండని పరిస్థితి. నాసిరకం.
* గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు తింటే జబ్బులు నయం కాని పరిస్థితి.
* గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఇచ్చే ప్రతి మందూ డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ స్టాండార్డ్స్‌కు మాత్రమే ఉండేట్టుగా అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే ఉండేట్టుగా అడుగులు పడ్డాయి.
* గతంలో 292 రకాల మందులు కూడా పేరుకే ఉండేవి. ఈరోజు 562 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అది కూడా నాణ్యతతో కూడిన మందులు.
* రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది విప్లవాత్మక మార్పుగా తీసుకురావడం జరిగింది.
* రోగం రాకముందే ఇనీషియల్ స్టేజ్‌లోనే వైద్యం అందించగలిగితే పేద వాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండ పోతుందని అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనదే.
* ప్రివెంటివ్ కేర్‌లో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 10032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఈరోజు సచివాలయాల పక్కనే అందుబాటులో ఉన్నాయి.
* ఒక సీహెచ్‌వో, ఒక ఏఎన్‌ఎం, ముగ్గురు లేదా నలుగురు ఆశా వర్కర్లు, 24/7 సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు గ్రామంలోనే ఉండేట్లుగా ఏర్పాట్లు.
* 105 రకాల మందులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. 14 రకాల డయాగ్నొస్టిక్ టెస్టులు చేస్తున్నారు.
* ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, వాటిలో కచ్చితంగా రెండు 104 వాహనాలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, మండలానికి నలుగురు డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీలో పని చేస్తుంటే మిగిలిన ఇద్దరు గ్రామాలకు వెళ్లి చికిత్సలు చేస్తారు.
* ప్రతి గ్రామానికి నెలకు రెండుసార్లు వెళ్లేట్టుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది.
* వైద్య రంగంలో నాడునేడు ద్వారా విలేజ్ క్లినిక్‌ల దగ్గర నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులన్నింటిలో కూడా రావాల్సిన చోట కొత్తవి, పాత వాటిని బాగు పరిచే కార్యక్రమం, మౌలిక సదుపాయాలు అన్ని జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పెంచడం జరుగుతున్నాయి.
* ఈరోజు ఇటువంటి గొప్ప మార్పులు పడుతున్న సందర్భంలో ఏ పేద వాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా చూడగలిగే గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చాం.
* ఆ పరిస్థితులు పేద వాడికి రాకుండా ఉండాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.
* ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి 25 లక్షలకు పెంచామో, ఈ విషయం, ఈ సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పే విషయం, వైద్యం కోసం అప్పుపాలు కావాల్సిన అవసరం లేదని చెప్పే విషయం, ఉచితంగా సేవలు ఎలా పొందగలుగుతారనే విషయం, ఉచితంగా వైద్యం ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అనే వివరాలన్నీ ప్రతి ఇంట్లోనూ వివరంగా చెప్పే కార్యక్రమం ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం.
* రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలులాంచ్ కోసం మొట్ట మొదటగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు.
* ప్రతి గడపకు, ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం అనే వివరాలన్నీచెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ యాప్‌ను రిజిస్ట్రేషన్ చేయించాలి.
* దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాల చొప్పునప్రతి వారం లాంచ్ అవుతుంది.
* ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి.
* ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఇద్దరూ రెండు టీమ్స్ కింద తయారవుతారు.
* ఒకటీమ్‌లో వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, మన ప్రభుత్వానికి మద్దతు తెలిపే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనకొనే వారు ఒక టీమ్ ఫాం అవుతారు.
* మరో టీమ్‌లో సీహెచ్‌వో లీడ్ చేస్తారు. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్లు కూర్చొని వారి కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఎలా ఉపయోగపడతాయి, అప్పులపాలు కాకుండా ఎలా వైద్యం చేయించుకోవాలనే వివరాలు చెప్పి తర్వాతి కుటుంబానికి వెళ్తారు.
* మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్‌ను ఫోన్లో డౌన్‌లోడ్ చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.
* కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ల ఫోన్లలో దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా.
* ప్రతి ఇంట్లో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుంది.
* ఈ కార్డులో కొత్తదనం ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులు స్మార్ట్ కార్డులు, క్యూ ఆర్ కోడ్‌ఉంది. పేషంట్‌కు సంబంధించిన హెల్త్ రికార్డు ఎలక్ట్రానిక్‌ఫార్మాట్‌లో సర్వర్‌లో రికార్డు అయి ఉంటుంది.
* పేషంట్లు ఎక్కడికైనా వెళ్తే రికార్డులన్నీ క్యూఆర్ కోడ్‌లో ఉంటాయి. ఇది కూడా ఒక గొప్ప మార్పు.
* ఇవన్నీ కూడా వివరిస్తూ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున అవగాహన కల్పించే కార్యక్రమాలు ఒకవైపున చేస్తూ, ఏ ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టిన తర్వాత ఆ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం.
* గతంలోఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఎవరినైతే హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ మన డేటా బేస్‌లోకి తీసుకువచ్చి ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా చేయాలి.
* ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది.
* పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా విలేజ్ క్లినిక్‌కు మందులు పోస్ట్ చేయబడతాయి. ఆ మందులను తీసుకెళ్లి ఆశా వర్కర్లు ఇస్తారు.
* డాక్టర్ పలానా తేదీకి రిఫర్ చేయాలి, ఏ రకమైనమందులు ఇవ్వాలనే యాస్పెక్ట్స్ కూడా డాక్టర్ రిఫరెన్స్‌కు ఇచ్చే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్‌ల ద్వారా జరుగుతుంది.
* అటువంటి పేషెంట్ల వివరాలు నోట్ చేసుకోవడం, పేషంట్ ప్రయాణ ఖర్చు కూడా ఆస్పత్రికి పోతే రూ.300 డబ్బులిస్తారు.
* డాక్టర్ చూసి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి.
* ఆ పేషంట్లు ఎవరు, వాళ్ల డేటా ఏమిటని కూడా విలేజ్‌క్లినిక్స్ ద్వారా టీమ్స్ ఫాం అయిన వీరు ఆ డేటాను ఫాలోఅప్ చేస్తారు.
* జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్2 మొదలవుతుంది.
* ప్రతి గ్రామంలోనూ ప్రతి 6 నెలలకోసారి హెల్త్ క్యాంపు రిపీట్ అవుతుంది. అది ఆరోగ్య సురక్ష ఫేజ్ 2.
* మళ్లీ ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక ఊరు. అంటే వారినికి ప్రతి మండలంలో ఒక ఊరు.
* ఆరు నెలలకోసారి మళ్లీ రిపీట్. మండలానికి రెండుగా డివిజన్ అయి, మంగళవారం ఒక ఊరు, మళ్లీ శుక్రవారం.
* జిల్లాలో సగం మండలాలు ఇటు, సగం అటు డివైడ్ చేసి ప్రతి మంగళవారం, శుక్రవారం జరుగుతుంది. వైద్యులను కొరత లేకుండా ఇలా చేస్తాం.
టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ.
* ఫేజ్ 1 గమనిస్తే, దాదాపు 50 రోజులు నిర్వహించాం. దీని వల్ల దాదాపు 6027843 మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరిగిన వాళ్లు.
* ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికీ వెళ్లి టెస్టు చేసిన వాళ్లలో.. ఆరు కోట్లా 45 లక్షలా 6 వేల 18 వైద్య పరీక్షలు చేశాం.
* ప్రతి ఇంట్లో రెండు మూడు పరీక్షలు చేశాం. బీపీ, షుగర్, హీమోగ్లోబిన్‌కు, అవసరాన్ని బట్టి యూరిన్ టెస్టులు ప్రతి ఇంట్లో చేశాం.
* కొత్తగా ప్రివెంటివ్ కేర్‌లో 2.40 లక్షల మందికి బీపీ లక్షణాలు కనిపించాయి. రీకన్ఫం టెస్టులు చేసి 56,648 మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
* 1,48,904 మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది. రీకన్ఫం అయ్యి 39,684 మందికి మందులు కూడా ఇవ్వడం మొదలైంది.
* ఇవన్నీ కూడా జనవరి 1వ తేదీకి పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి 2వ తేదీ నుంచి ఫేజ్ 2 మొదలవుతుంది.
* ఈ రెండు విషయాలు.. ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మోనిటర్ చేయడం, వాళ్లందరినీ డేటాబేస్‌లోకి తీసుకోవడం, హ్యాండ్‌హోల్డ్ చేసి రిఫరల్ ట్రీట్‌మెంట్, ఉచితంగా మందులు ఇవ్వడం, రెండో వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ, ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం ఈ రెండు కార్యక్రమాలుకూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఇన్‌వాల్వ్ కావాలని కోరుతున్నా.
* ఇవన్నీ కూడాకచ్చితంగా ప్రతి గ్రామంలో జరిగించేట్టుగా అడుగులు పడాలి. దాని వల్ల ప్రతి పేదవాడికీ మంచి జరుగుతుంది.
* వీటన్నింటిపై పూర్తి అవగాహనమీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు.
* మీ ప్రతి ఫోన్‌కూ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి 6 నిమిషాల వీడియో పంపించే కార్యక్రమం చేస్తాం.
* వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు, ఆశావర్కర్లు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికీ పోతున్నారో వాళ్లు కరెక్ట్‌గా ఎఫెక్టివ్‌గా చెప్పడంలో మీకు సహకరించేలా 6 నిమిషాల వీడియోమెసేజింగ్ కూడా హెల్త్ డిపార్ట్‌మెంట్ కృష్ణబాబు అన్న తయారు చేయించారు.
* ప్రతి ఇంట్లో ఆ మెసేజ్ చూపించండి. మీరు మర్చిపోయినా ఆ వీడియోమెసేజ్‌ద్వారా పేద కుటుంబానికి తెలుస్తుంది.
* ఆ వీడియో మెసేజ్ వాళ్ల ఫోన్లలోకి కూడా పంపించండి. ఎప్పుడైనా వినాలనుకుంటే వింటారు.
* బ్రోచర్ల రూపంలో ఇస్తున్నామో, ఆ వివరాలన్నీ వీడియోమెసేజ్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
వాళ్ల ఫోన్లలోకి పంపినా మంచి జరుగుతుంది. (Mega Arogya sri)
* అన్ని వివరాలనూ ప్రతి కలెక్టర్, ప్రతి ఎస్పీ బాధ్యతగా తీసుకోండి. మనం ఓనర్‌షిప్ తీసుకుంటేనే ఈ మెసేజ్‌ను ప్రతి ఇంటికీ తీసుకుపోగలుగుతాం.
* దయచేసి ప్రతి కలెక్టర్, ప్రతి ఎస్పీ, ప్రతి జాయింట్ కలెక్టర్ ఓనర్‌షిప్ తీసుకోండి.
* ప్రతి ఫోన్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్నందరినీ విన్నవిస్తున్నాం.
* దట్స్ ఇట్ ఫ్రం మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అని తెలియజేస్తున్నా.
ఇదీ చదవండి:DGP Disk Awards: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏపీ డీజీపీ డిస్క్ అవార్డులు
