HomeAndhra PradeshKommineni: విద్యయే ఎనలేని సంపద.. గొప్ప ఆశయంతో సీఎం జగన్‌ సంస్కరణలు: కొమ్మినేని

Kommineni: విద్యయే ఎనలేని సంపద.. గొప్ప ఆశయంతో సీఎం జగన్‌ సంస్కరణలు: కొమ్మినేని

Kommineni: విద్యయే ఎనలేని సంపద అనే గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నారని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. బాపట్ల జిల్లా వడ్డివారిపాలెంలోని సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మహానటి సావిత్రి జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం, ఆంధ్రప్రదేశ్ మహానటి సావిత్రి కళాపీఠం, గ్రామస్తులు మరియు పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ కొమ్మినేని మాట్లాడారు. (Kommineni)

మహానటి సావిత్రి స్థాపించిన ఈ పాఠశాలలో ఆమె జయంతి వేడుకలో పాల్గొనడం అదృష్టమన్నారు. హిమాలయ శిఖరం లాంటి మహానటి సావిత్రి ఆనాడే స్థాపించిన పాఠశాల ప్రస్తుతం అభివృద్ధి లో నాడు నేడు తో మరింత ద్విగుణీకృతం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జగనన్న అమలుపరుస్తున్న సంస్కరణలకు నిలయంగా , ఆదర్శంగా మహానటి సావిత్రమ్మ విద్యాలయం నిలుస్తుంది అన్నారు. మౌలిక వసతులు కల్పన, పరిసరాల పరిశుభ్రత, క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్య అందించడం ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు.

జగనన్న ఇంతటి ఉన్నత విద్యా సంస్కరణలు అమలు చేస్తుంటే ప్రతి పక్షాలు జీర్ణించుకోలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి కి ఎవరూ సాటి రారని పేర్కొన్నారు. సావిత్రి పాఠశాల మరింత అభివృద్ధి చెందే అవకాశాలను మెరుగు పరిచేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కొమ్మినేని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, కళాపీఠం కొమ్మినేని గజమాలతో దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కళాపీఠం జ్ఞాపికను బహుకరించారు.

ఈ సందర్భంగా మహానటి సావిత్రి కళా పీఠం హై స్కూల్ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న చాలా సిబ్బందిని, పూర్వ విద్యార్థులను మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని చేతుల మీదుగా ఘనంగా సత్కరించింది. సన్మానం అందుకున్న వారిలో ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, ప్రధానోపాధ్యాయిని మాధవి, సుజాత టీచర్, గ్రామ ప్రథమ పౌరులు వడ్డీ శ్రీనివాసరావు వడ్డి సునీత- శ్రీనివాసరావు దంపతులు, వడ్డి లక్ష్మోజి వడ్డి హనుమంతరావు, తులం రమణ(చంటి ) పూర్వ విద్యార్థులు గరికపాటి అంకమ్మ, తిరుపతి వెంకయ్య, వారి మిత్ర బృందం, బడే ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టు సింహాద్రి కృష్ణ ప్రసాద్, లేబాక నాగేశ్వరావు, లోవరాజు తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: Exams: బాయిలర్ అటెండెంట్స్ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు