HomeAndhra PradeshExams: బాయిలర్ అటెండెంట్స్ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ

Exams: బాయిలర్ అటెండెంట్స్ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ

Exams: బాయిలర్ అటెండెంట్స్ 2023కు గానూ అర్హత గల అభ్యర్థుల నుంచి పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన తేదీలు, పరీక్షల సెంటర్ తదితర అంశాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను పంపేందుకు 8 జనవరి, 2024 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని బోర్డు ఆఫ్ ఎగ్జామినర్స్ ఛైర్మన్, బాయిలర్ల డైరెక్టర్ వెల్లడించారు. (Exams)

బాయిలర్ అటెండెంట్ రూల్స్, 2011 ప్రకారం 2024 మార్చి / ఏప్రిల్ లో నిర్వహించే బాయిలర్ అటెండెంట్ మొదటి, రెండవ తరగతి పరీక్షల కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని బోర్డు ఆఫ్ ఎగ్జామినర్స్ ఛైర్మన్, బాయిలర్ల డైరెక్టర్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన తేదీలు, పరీక్షల సెంటర్ తదితర అంశాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. అర్హతలు, అనుభవం, వయస్సు, ఇతర సమాచారం కోసం http://www.ap.gov.in వెబ్ సైట్ సందర్శించాలని తెలిపారు.

దరఖాస్తులు, ఇతర వివరాలు సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను 8 జనవరి, 2024 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా దరఖాస్తుదారులు ఎవరైనా 12 ఫిబ్రవరి 2021న జారీ చేసిన బి3/502/2021 ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్నట్లయితే మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బోర్డు ఆఫ్ ఎగ్జామినర్స్ ఛైర్మన్, బాయిలర్ల డైరెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: YS Jagan in Uddanam: ఉద్దానం సమస్య శాశ్వత పరిష్కారం.. బహిరంగ సభలో సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం ఇదే

SBPB Meeting: విజయవాడలో 53వ స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ భేటీ

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు విస్తరణ

YSRCP Youth President: వైయస్సార్‌సీపీలో వరుస మార్పులు.. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి

AP Mandous Cyclone: తుపానుతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోలుపై సీఎం కీలక ఆదేశాలు

YSR Law Nestham: వైయస్సార్‌ లా నేస్తం నిధుల విడుదల.. ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.7,98,95,000 జమ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు