HomeAndhra PradeshYSR Law Nestham: వైయస్సార్‌ లా నేస్తం నిధుల విడుదల.. ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున...

YSR Law Nestham: వైయస్సార్‌ లా నేస్తం నిధుల విడుదల.. ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.7,98,95,000 జమ

YSR Law Nestham: యువ న్యాయవాదులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తొలి మూడు సంవత్సరాలు వారికి ఊతమిస్తూ 2023-24 సంవత్సరాలకు సంబంధించి వైయస్సార్‌ లా నేస్తం పేరుతో సాయం అందిస్తోంది. ఈ మేరకు నేడు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. (YSR Law Nestham)

రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టయిపెండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ దాకా (6 నెలలు) ఒక్కొక్కరికి రూ.30,000 ఇస్తూ, మొత్తం రూ.7,98,95,000 సీఎం జమ చేస్తున్నారు.

కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టయిపెండ్‌ను ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు.

న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్” ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయాన్ని జగన్‌ ప్రభుత్వం అందించింది.

ఈ ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్ లైన్ లో sec_law@ap.gov.in లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లై చేసుకోవాలి.

“వైఎస్సార్ లా నేస్తం” పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలపొచ్చు.

మరింత సమర్థంగా పథకాన్ని మానిటర్ చేసేలా.. ఏక కాలంలో యువ న్యాయవాదులు పెద్ద మొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునేందుకు మరింత ఉపయోగపడేలా.. ప్రతి ఆరు నెలలకోసారి బటన్ నొక్కి లబ్ది అందిస్తున్నారు సీఎం జగన్‌.

పథకానికి దరఖాస్తు చేసుకోదలిచిన వారు https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్ లో తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్ ను పొందుపరిచి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.

ఇదీ చదవండి: Reddy Politics: తెలంగాణలో హీరోలు..! ఏపీలో విలన్లు!! రెడ్డి ప్రజా ప్రతినిధులపై ఆ మీడియా తీరిదీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు