HomeAndhra PradeshYSRCP Candidates change: తెలంగాణ ఫలితాలతో జగన్‌ అలర్ట్‌.. 11 స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. మొత్తం...

YSRCP Candidates change: తెలంగాణ ఫలితాలతో జగన్‌ అలర్ట్‌.. 11 స్థానాల్లో అభ్యర్థుల మార్పు.. మొత్తం 82 మార్పులు ఖాయమా?

YSRCP Candidates change: తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీలో సీఎం వైయస్‌ జగన్‌ అలర్ట్‌ అయ్యారు. తెలంగాణలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఎంత వ్యతిరేకత వచ్చినా కేసీఆర్ లెక్క చేయలేదు. దాని ఫలితంగా ఓటమిని చవిచూశారు. అభ్యర్థులను కొన్ని చోట్ల మార్చడంతో అక్కడ విజయం సాధించగలిగారు. మరోవైపు ఏపీలో సైతం చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థి ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాలను నిశితంగా గమనించిన సీఎం జగన్‌.. కీలక నిర్ణయాల దిశగా వేగంగా, ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను నియమిస్తూ నిన్న వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. (YSRCP Candidates change)

అభ్యర్థులను మార్చిన 11 స్థానాలు ఇవీ..

1. ప్రత్తిపాడు (యస్.సి.) – బాలసాని కిరణ్ కుమార్
2. కొండేపి (యస్.సి.) – డా॥ ఆదిమూలపు సురేష్
3. వేమూరు (యస్.సి.) – వరికూటి అశోక్ బాబు
4. తాడికొండ (యస్.సి.) – మేకతోటి సుచరిత
5. సంతనూతలపాడు (యస్.సి.) – డా॥ మేరుగు నాగార్జున

6. చిలకలూరిపేట – మల్లెల రాజేష్ నాయుడు
7. గుంటూరు పశ్చిమ – విడదల రజిని
8. అద్దంకి – పాణెం హనిమి రెడ్డి
9. మంగళగిరి – గంజి చిరంజీవి
10. రేపల్లె – డా|| ఈవూరు గణేష్
11. గాజువాక – వరికూటి రామచంద్రరావు

మొత్తం 82 స్థానాల్లో మార్పులు?

ఏపీలో సుదీర్ఘంగా సీఎంగా ఉండాలన్న లక్ష్యంతో జగన్‌ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పేదల ఇళ్లలో దివంగత వైయస్సార్‌ ఫొటో పక్కన తన ఫొటో ఉండేలా పాలన చేస్తానని చెబుతుంటారు. ఎన్నికల్లో గెలుపుపై ఇప్పటికే జగన్‌ దీమాగా ఉన్నారు. 2024లో ప్రతిపక్షాన్ని ప్రజా క్షేత్రంలో జీరోగా చేయడమే ఆ పార్టీ అధినేత పని చేస్తున్నారు. ఇప్పటికి 11 మందే కానీ, ఎన్నికల నాటికి మొత్తం 82 స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖాయమని జగన్‌ సంకేతాలిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ లిస్టు చక్కర్లు కొడుతోంది.

అభ్యర్థుల మార్పుపై సీఎం జగన్‌ ఏ మాత్రం సంకోచించడం లేదు. కొందరు అలకబూని పార్టీకి రాజీనామా చేసినా సరే.. తన నిర్ణయాలు మారవంటూ కుండబద్ధలు కొడుతున్నారు సీఎం జగన్‌. నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదే తరహాలో అలిగి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌కు తన లేఖను పంపారు.

ఇదీ చదవండి: YSR Law Nestham: వైయస్సార్‌ లా నేస్తం నిధుల విడుదల.. ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.7,98,95,000 జమ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు