HomeTelanganaTelangana Congress Victory: కాంగ్రెస్‌ గెలుపు వెనుక రహస్యాలు.. పదేళ్ల తర్వాత విజయం సాధ్యమైందిలా..

Telangana Congress Victory: కాంగ్రెస్‌ గెలుపు వెనుక రహస్యాలు.. పదేళ్ల తర్వాత విజయం సాధ్యమైందిలా..

Telangana Congress Victory: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టబోతోంది. ముఖ్యమంత్రి ప్రకటనపై కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ.. ఘన విజయంవెనుక అనేక వ్యూహాలు పని చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ విజయ రహస్యాలు, వ్యూహాలు, బీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కొందో ఓ విశ్లేషణ ఇదీ.. (Telangana Congress Victory)

* పదేళ్ల తర్వాత సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. దాన్ని కాంగ్రెస్‌ అన్ని విధాలుగా అనుకూలంగా మలుచుకుంది.
* డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలు అమలు కాకపోవడంపై ప్రజల అసంతృప్తి
* ఆరు గ్యారెంటీలు.. ప్రతి నెలా మహిళలకు రూ.2500, రూ.500కే వంట గ్యాస్‌, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణం హామీలు ఇంపాక్ట్‌ చూపాయి.
* రైతుభరోసా పెంపుతో పాటు కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు 12 వేలు ప్రకటించడం కాంగ్రెస్‌కు ప్లస్‌ అయ్యింది.
* గతంలో తమకు రైతు బంధు అందలేదని అసంతృప్తితో ఉన్న వారిని కాంగ్రెస్‌ హమీ ఆకట్టుకుంది.
* ఒకేసారి రూ.2 లక్షలు రైతు రుణమాఫీ కూడా ఇంపాక్ట్‌ చూపింది.

* చేయూత పింఛన్లు రూ.4,000కు పెంపు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వైద్యం హామీలు ప్రభావం చూపాయి.
* గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూళ్ల ఏర్పాటు లాంటివి జనానికి కొత్తగా అనిపించాయి.
* తొలి ఏడాదే 2లక్షల ఉద్యోగాలు ప్రకటనతో యువత ఆకర్షితులయ్యారు. నియామకాల విషయం కేసీఆర్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
* టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో సుమారు 12కు పైగా లీకులు వెలుగు చూడటం ప్రభుత్వానికి చేటు చేసింది.
* సుమారు 30లక్షల మందికిపైగా అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని భావించాలి. దీనిపై కాంగ్రెస్‌ సమర్థంగా వర్కౌట్‌ చేసింది.

* బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కాంగ్రెస్‌ అప్రమత్తమై అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపింది.
* అంతర్గత కుమ్ములాటల భయంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌లను చాలా చోట్ల మార్చలేదు.
* ఆఖరి నిమిషం వరకు ఆచితూచి వ్యవహరించి అభ్యర్థులను కాంగ్రెస్‌ ఖరారు చేసింది.
* పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇచ్చింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులను గుర్తించింది.
* తుమ్మల, పొంగులేటి, వివేక్‌, కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలను నిలబెట్టి గెలిపించుకుంది.

* బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థి తామే అని నిరూపించడంలో రేవంత్‌రెడ్డిది కీలక పాత్ర.
* కేసీఆర్‌ను ఎదుర్కోవడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. అనేక అంశాలను సమర్థించుకొని మాట్లాడటం, బలమైన సామాజిక వర్గం తన వెనక ఉందనే సంకేతాలు ఇచ్చారు. మాటకారితనం ప్లస్‌ అయ్యింది.
* తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందాం.. ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపునివ్వడం వర్కౌట్‌ అయ్యింది.
* రేవంత్‌కు పార్టీ అధిష్టానం కాస్త ఫ్రీడమ్‌ ఇవ్వడం.
* కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తానని రేవంత్‌ అక్కడ పోటీ చేయడం హీరోయిజాన్ని చూపినట్లయింది.

* ప్రచారంలో రేవంత్‌రెడ్డి దూసుకెళ్లడం, జాతీయ నాయకత్వం సమన్వయం.
* ప్రభుత్వ వ్యతిరేకత చీలేందుకు అవకాశాలను కాంగ్రెస్‌ గణనీయంగా తగ్గించింది. సీపీఐ, సీపీఎం, కోదండరామ్‌, షర్మిల పార్టీలతో సమన్వయం చేయడం. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటే అని ప్రచారం చేయడం.
* సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కాంగ్రెస్‌. బీఆర్‌ఎస్‌కు పోటాపోటీగా ప్రచార పాటలు విడుదల చేసి సోషల్‌ మీడియాలో జోష్‌ పెంచింది.
* వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, రేవంత్‌ రెడ్డి కలిసి మీడియాలో ప్రకటనలు, ప్రచారం డిజైన్‌ లాంటివి సమర్థంగా చేశారు.
* బీఆర్‌ఎస్‌పై మీమ్స్‌ పేజీలను కాంగ్రెస్‌ ప్రోత్సహించింది. 24 గంటలూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూటూబ్‌లో ప్రచారం గట్టిగా చేశారు.

* కాంగ్రెస్‌ తరఫున 200 మందికి పైగా టీమ్‌.. ట్విట్టర్‌లో 24 గంటలూ ప్రచారం చేసింది.
* కారు పోవాలి.. హస్తం రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్‌ రావాలి అనే స్లోగన్స్‌ జనాన్ని ఆకట్టుకున్నాయి.
* రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి జోష్‌ వచ్చింది.
* వ్యూహకర్త సునీల్‌ కనుగోలు అస్త్రాలు పని చేశాయి.
* మొదట పార్టీని గెలిపించుకుందాం.. మనలో కొట్లాటలు తర్వాత చూసుకుందామనే భావన నేతల్లో వచ్చింది.

* భట్టి విక్రమార్క, రేవంత్‌ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు.
* నేతల పాదయాత్రలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.
* రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనలతో శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది.
* రాహుల్‌ పాదయాత్ర ఎఫెక్ట్‌ కర్ణాటకతోపాటు తెలంగాణపై చూపింది.
* టీడీపీ, చంద్రబాబు సపోర్ట్‌ చేయడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
* ఇందిరమ్మ ఇండ్లులేని ఊరు లేదని, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు లేని ఊళ్లు వేలాదిగా ఉన్నాయన్న ప్రచారం కలిసొచ్చింది.
* ప్రజాస్వామ్య పునరుద్ధరణ నినాదం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.

ఇదీ చదవండి: Congress win in Telangana: తెలంగాణ హస్తగతం.. CONG 64, BRS 39, BJP 8, MIM 7, CPI 1

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు