ECI on Karnataka Govt: కర్ణాటక సిద్ధరామయ్య సర్కార్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో సిద్ధూ ప్రభుత్వంపై ఈసీ ఫైర్ అయ్యింది. తెలంగాణలో ఎల్లుండి ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. (ECI on Karnataka Govt)
కర్ణాటక ప్రభుత్వం తరఫున తెలంగాణాలో ప్రకటనలు ఇవ్వడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. కర్ణాటక సీఎస్ కు ఈ మేరకు లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని కమిషన్ స్పష్టీకరించింది. రేపు సాయంత్రం 5లోపు వివరణ ఇవ్వాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ప్రకటనలు ఆపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని స్పష్టం చేసింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం జోరుగా ప్రచారం నిర్వహించింది. సీఎం కేసీఆర్ రోజుకు మూడు నుంచి నాలుగు సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీల తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా ఈసారి ఒకే రకమైన స్పీచ్ ఉండటం గమనార్హం. దళిత బంధు, రైతు బంధు, రైతులకు 24 గంటల కరెంటు గురించి కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వంలో పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రస్తావించారు.
పదేండ్ల కిందట ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లయింది తెలంగాణ.. అనే నినాదం విజయవంతమైందనే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్లు వస్తే మళ్లీ నాటి పరిస్థితులు వస్తాయంటూ ప్రతిపక్షాలను కేసీఆర్ ఎద్దేవా చేశారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారంలో కీలక భాగమయ్యారు. ఇక బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్ నగరంలో రోడ్డుషో నిర్వహించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంలో భాగమయ్యారు.
ఇక కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ ఇంకా పలువురు కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రేవంత్‌రెడ్డి అయితే కాంగ్రెస్ గెలిచేసిందని, ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల గురించే ఎక్కువగా మాట్లాడుతుండటం విశేషం.
Read Also :PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
