HomeAndhra PradeshCM Jagan on Ambedkar Statue: సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే అంబేద్కర్‌ విగ్రహం

CM Jagan on Ambedkar Statue: సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే అంబేద్కర్‌ విగ్రహం

CM Jagan on Ambedkar Statue: విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ స్మృతివనం, అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్‌ నిన్న క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సామాజిక న్యాయ స్పూర్తికి ఈ ప్రాజెక్టు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదన్నారు. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇదన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. (CM Jagan on Ambedkar Statue)

* నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలి.
* స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదు.
* వచ్చే రిపబ్లిక్‌ డే నాటికి పూర్తయ్యే విధంగా… పనులు చేపడుతున్నామన్న అధికారులు.
* జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు.

* జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న అధికారులు.
* కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు కూడా పూర్తి కావాలన్న సీఎం.
* కన్వెన్షన్‌ సెంటర్‌లో మౌలిక సదుపాయాలును పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశం.
* నిర్వహణను సమర్థంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

* స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలన్న సీఎం.
* నడక దారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలని ఆదేశం.
* పనులు నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
* ఆ మేరకు నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలన్న సీఎం.

* అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.
* స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ కాన్సెప్ట్‌గా అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు.
* అంబేద్కర్‌ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు. విగ్రహం ఎత్తు 125 అడుగులు.

* కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల సుందీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు.
* పార్క్, వాకింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు.
* పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు.

Read Also : CS on CM Promises: హామీల అమలుపై సత్వరం చర్యలు తీసుకోవాలి: సీఎస్‌ జవహర్‌రెడ్డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు